Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి బాంబు వేసిన లక్నో: కేజీఎఫ్ బ్రాండ్ డైలాగ్‌తో బెంగళూరు ఘాటు రిప్లై: స్టేడియం బయటా ఫైట్

IPL 2022: Social media banters between IPL franchises LSG and RCB

ముంబై: సోషల్ మీడియా వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీల మధ్య యుద్ధం కొత్తేమీ కాదు. తమ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లను రణభూమిగా మార్చుకుని.. ప్రత్యర్థిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటాయి. ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో ఇలాంటివి తరచూ చూస్తుంటాం. ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌ మీద ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటుంటాయి. అటాక్స్.. కౌంటర్ అటాక్స్ సర్వసాధారణం. ఇది హెల్తీగానే సాగుతుంటుంది.

ఆ లిమిట్స్ అనేది ఎక్కడా దాటవు ఆయా ఫ్రాంఛైజీలు. మ్యాచ్‌తో పాటు అభిమానులకు అదో రకం ఎంటర్‌టైన్‌మెంట్. దీన్ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటారు. మంగళవారం రాత్రి డీవై పాటిల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ సందర్భంగా కూడా ఇదేరకమైన బిగ్ ఫైట్ కనిపించింది. ట్విట్టర్ వేదికగా ఈ రెండు జట్ల ఫ్రాంఛైజీలు కూడా ఒకదానిపై ఒకటి కౌంటర్లు వేసుకున్నాయి.

తొలుత లక్నో సూపర్ జెయింట్స్ ఈ యుద్ధానికి తెర తీసింది.. తొలి బాంబు వేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడబోయే తుదిజట్టును ప్రకటించిన లక్నో- వీళ్లని ఎదుర్కోవడం నీ వల్ల కాదు కొడుకా.. అంటూ కామెంట్ యాడ్ చేసింది. ఈ పోస్ట్‌పై అప్పటికప్పుడు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంఛైజీ. మ్యాచ్ గెలిచిన తరువాత చెలరేగింది. మ్యాచ్ గెలిచి చూపించామనే అర్థం వచ్చేలా కామెంట్ చేసింది.

కేజీఎఫ్- ఛాప్టర్ 1 సినిమాలోని పాపులర్ డైలాగ్‌ను సంధించింది. If you think you are bad.. I'm your dad.. అంటూ యష్ పలికిన డైలాగ్‌కు సంబంధించిన జిఫ్‌ను తన ట్విట్టర్ పేజ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. దాన్ని లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్యాగ్ చేసింది. ఈ ఎపిసోడ్ తరువాత ఈ రెండు జట్ల ఫ్యాన్స్ తగులుకున్నారు. కాగా- ఈ మ్యాచ్‌ను చూడటానికి కేజీఎఫ్ చాఫ్టర్ 2 యాక్టర్స్ సంజయ్ దత్, రవీనా టండన్ స్టేడియానికి వచ్చారు.


తొలుత లక్నో సూపర్ జెయింట్స్ ఈ యుద్ధానికి తెర తీసింది.. తొలి బాంబు వేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడబోయే తుదిజట్టును ప్రకటించిన లక్నో- వీళ్లని ఎదుర్కోవడం నీ వల్ల కాదు కొడుకా.. అంటూ కామెంట్ యాడ్ చేసింది. ఈ పోస్ట్‌పై అప్పటికప్పుడు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంఛైజీ. మ్యాచ్ గెలిచిన తరువాత చెలరేగింది. మ్యాచ్ గెలిచి చూపించామనే అర్థం వచ్చేలా కామెంట్ చేసింది.

Story first published: Wednesday, April 20, 2022, 14:24 [IST]
Other articles published on Apr 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+