
రివ్యూ తీసుకోబట్టి బతికిపోయాడు
ఇక ఛేదనలో 33 పరుగులకే ముంబై 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టైంలో సిమ్రాన్ జిత్ బౌలింగ్‌లో ముంబైకి మరో భారీ దెబ్బ పడేది. క్రీజులో హృతిక్ షోకీన్ ఉండగా.. సిమ్రాన్ జిత్ వైడ్ వేశాడు. ఈ వైడ్ బాల్‌ను కీపర్ ధోనీ అందుకుని బిగ్ అప్పీలు చేశాడు. అప్పటివరకు చడిచప్పుడూ చేయకుండా ఉన్న అంపైర్ ఒక్కసారి ధోనీ అప్పీలును చూసి కంగారుపడి ఆ ఔటే ఔటే అన్నట్లు ఔటిచ్చేశాడు. షోకీన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో నాటౌట్ అని తేలింది. అదే ఒకవేళ పవర్ కట్ ఇష్యూ ఉండుండే సీన్ వేరేలా ఉండేది. పవర్ కట్ ఇష్యూ అప్పటికీ సాల్వ్ అయిపోవడంతో షోకీన్ బతికి బట్టకట్టాడు. దీనిపై నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. ధోనీ అప్పీలు చేస్తే అంపైర్ ఔటిచ్చేస్తాడా.. ధోనీ అంటే అంతా భయమా, గౌరవమా.. లేక భయంతో కూడిన గౌరవమా అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

తర్వాత ఇద్దరు కలిసి
ఇక అంపైర్ తప్పిదానికి బలి కావాల్సినొడు బతికి పోవడంతో ముంబైకి మంచి జరిగింది. షోకీన్, తిలక్ వర్మ కలిసి ఐదో వికెట్‌కి 48పరుగుల భాగస్వామ్యం జోడించారు. 23 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన హృతిక్ షోకీన్, మొయిన్ ఆలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయినప్పటికీ తిలక్ వర్మ 32 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేయగా, టిమ్ డేవిడ్ 7 బంతుల్లో 2 సిక్సర్లతో 16 పరుగులు చేసి మ్యాచ్‌ని విజయతీరాలకు చేర్చారు.
|
అంపైర్లు పెంట పెంట చేసేస్తున్నారు
ఈ సీజన్లో అంపైర్లు చాలా సార్లు పెంట పెంట చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో నోబాల్ ఇష్యూ ఎంత పెద్ద రచ్చయిందో తెలిసిదే. ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు అంపైర్ నితిన్ మీనన్‌ను కన్పిస్తే కొట్టేస్తారేమో అనే రేంజులో ఆ వివాదం ముదిరింది. ఇక ఆ తర్వాత కూడా వైడ్ బాల్స్ ను నాట్ వైడ్ అని, వైడ్ కానీ బాల్స్ ను క్లియర్ వైడ్ అంటూ మరికొందరు అంపైర్లు అటు బ్యాటర్లను, ఇటు బౌలర్లను కన్ఫ్యూజ్ చేసేశారు. దీంతో వైడ్ బాల్స్ కు కూడా రివ్యూ పెట్టండంటూ క్రికెట్ ప్రముఖులు సూచించేదాకా యవ్వారం వచ్చింది. మొన్నటికి మొన్న రోహిత్ అవుట్ కూడా వివాదస్పదమైంది. రోహిత్ బ్యాట్ కు టచ్ అయ్యే ముందే అల్ట్రా ఎడ్జ్ లో స్పైక్స్ వస్తే థర్డ్ అంపైర్ ఎంచక్కా ఔటిచ్చేశాడు. ఇక క్యాచ్ అవుట్లలోనూ కొన్నిసార్లు అంపైర్ల డిసిషన్లు వివాదస్పమయ్యాయి. ఏదేమైనా ఈ సీజన్లో కొన్నిసార్లు అంపైర్ల డిసిషన్లు కూడా గేమ్ ఛేంజర్ లా మారుతున్నాయి.