Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అత్యంత చెత్త‌ రికార్డు.. ఆ జాబితాలో మొద‌టి స్థానం

Sunrisers hyderabad have the worst record of losing the most matches in the IPL since 2020
IPL 2022 : Sunrisers Hyderabad Record In IPL

ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓ చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకుంది. 2020 నుంచి ఐపీఎల్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఓడిన జ‌ట్ల జాబితాలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మొద‌టి స్థానంలో ఉంది. 2020 నుంచి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అత్య‌ధికంగా 21 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక 17 మ్యాచ్‌ల్లో ఓడి రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, పంజాబ్ కింగ్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాయి. ఆ త‌ర్వాత 16 ప‌రాజ‌యాల‌తో చెన్నైసూప‌ర్ కింగ్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాయి. ఇక 15 విజ‌యాల‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఈ జాబితాలో నాల్గో స్థానంలో ఉన్నాయి.

కాఘౄ ఫేలవ ప్ర‌ద‌ర్శ‌న‌తో గ‌త ఏడాది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ పాయింట్ల ప‌ట్టికలో చిట్ట చివ‌ర‌న నిలిచి తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. దీంతో ఈ ఏడాది స‌న్‌రైజ‌ర్స్ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఈ సీజ‌న్లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ స‌న్‌రైజ‌ర్స్ ఓడిపోయి ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట‌చివ‌ర‌న కొన‌సాగుతుంది. అటు డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నైసూప‌ర్ కింగ్స్‌ది కూడా ఇదే ప‌రిస్థితి. ఆ జ‌ట్టు లీగ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. సీఎస్కే వ‌రుస‌గా 3 ఆరంభ మ్యాచ్‌ల‌ను ఓడిపోవ‌డం ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇదే తొలి సారి కావ‌డం గ‌మ‌నార్హం. ఇక 5 సార్లు ఐపీఎల్ ఛాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్ కూడా ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

Sunrisers hyderabad have the worst record of losing the most matches in the IPL since 2020


ఇక ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నేడు
డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నైసూప‌ర్ కింగ్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. డివై పాటిల్ స్టేడియం వేదిక‌గా మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సీజ‌న్‌లో ఇరు జ‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు బోణీ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 3 మ్యాచ్‌ల్లో చెన్నైసూప‌ర్ కింగ్స్ ఓడ‌గా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ఓడింది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి సీజ‌న్‌లో తొలి విజ‌యం సాధించాల‌ని రెండు జ‌ట్లు ప‌ట్టుద‌ల‌గా ఉన్నాయి. మొత్తంగా రెండింట్లో ఏదో ఒక జ‌ట్టు నేటి మ్యాచ్‌లో త‌మ విజ‌యాల ఖాతాను తెర‌వ‌నుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా)
రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, ప్రియామ్ గార్గ్/అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, శ్రేయస్ గోపాల్, నటరాజన్

Story first published: Saturday, April 9, 2022, 14:10 [IST]
Other articles published on Apr 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+