Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: ఆ స‌మ‌యంలో నా గుండె వేగంగా కొట్టుకుంది.. వేలం గురించి శ్రేయ‌స్ అయ్య‌ర్ వ్యాఖ్య‌లు

IPL 2022: Shreyas Iyer said his heart was pounding during the mega auction
IPL Auction 2022: Shreyas Iyer To KKR For 12.25 Crore, Dhawan For Punjab | Oneindia Telugu

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం జ‌ర‌గుతున్న సమ‌యంలో తాను కంగారుకు గుర‌య్యాన‌ని, ఆ స‌మ‌యంలో త‌న గుండె వేగంగా కొట్టుకుంద‌ని టీమిండియా యువ ఆట‌గాడు శ్రేయ‌స్ అయ్య‌ర్ తెలిపాడు. తాజాగా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ యూట్యూబ్ ఛానెల్‌లో మెగా వేలం స‌మ‌యంలో తాను అనుభవించిన ప‌లు విష‌యాల‌ను గురించి శ్రేయ‌స్ అయ్య‌ర్ అభిమానుల‌తో పంచుకున్నాడు. వేలంలో త‌న పేరు స్క్రీన్ మీద‌కి రాగానే త‌నలోని భావోద్వేగాల‌ను ఆపుకోలేక‌పోయాన‌ని చెప్పాడు. త‌న గుండె వేగంగా కొట్టు కోవ‌డం ప్రారంభ‌మైంద‌ని శ్రేయ‌స్ అయ్య‌ర్‌ తెలిపాడు. మెగా వేలంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌న కోసం బిడ్ వేసిన‌ప్పటి నుంచి తాను చూస్తూనే ఉన్నాన‌ని, ఇత‌ర ఫ్రాంచైజీలు కూడా త‌న కోసం బిడ్లు వేశాయ‌ని అయ్య‌ర్ గుర్తు చేసుకున్నాడు.

ఆ స‌మయంలో టీమిండియా ఆట‌గాళ్లు త‌న చుట్టూనే ఉన్నార‌ని, రిలాక్స్‌గా ఉండేందుకు ప్ర‌య‌త్నించాన‌ని, అయిన‌ప్ప‌టికీ కాస్త ఆందోళ‌న‌కు గుర‌య్యాన‌ని శ్రేయ‌స్ అయ్య‌ర్ తెలిపాడు. చివ‌ర‌కు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌న‌ను భారీ ధ‌ర‌కు ద‌క్కించుకోవ‌డం ప‌ట్ల ఆనందంగా ఫీల‌య్యాన‌ని, కొంచెం గ‌ర్వంగా కూడా అనిపించింద‌ని చెప్పాడు. ఇక కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌న‌ను కొనుగోలు చేయ‌డం ప‌ట్ల శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆనందం వ్య‌క్తం చేశాడు. ఆ జ‌ట్టు కోసం గ‌తంలో క‌ష్ట‌ప‌డిన వారి అడుగు జాడ‌ల్లో న‌డుస్తాన‌ని తెలిపాడు. జ‌ట్టును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని అన్నాడు. వ్య‌క్తిగ‌తంగా తాను ఆట‌గాళ్ల కెప్టెన్‌ను అని, అంద‌రిని ఒకే ల‌క్ష్యం కోసం ముందుకు సాగే వాతావ‌ర‌ణం క‌ల్పిస్తాన‌ని అయ్య‌ర్ చెప్పుకొచ్చాడు. కాగా అయ్యర్‌ను తమ జట్టు కెప్టెన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ హెడ్ కోచ్ మెక్‌క‌ల్ల‌మ్‌తో క‌లిసి ప‌ని చేసేందుకు ఆస‌క్తిగా ఉన్నాన‌ని శ్రేయ‌స్ అయ్య‌ర్ చెప్పాడు. మెక్‌క‌ల్ల‌మ్ దూకుడైన కెప్టెన్ అని, రిస్క్‌తో కూడిన గేమ్‌ల‌ను ఆడేందుకు వెనుకాడ‌డని అన్నాడు. గ‌తంలో మెక్‌క‌ల్ల‌మ్ న్యూజిలాండ్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్ల‌కు ఆడింది చూస్తే ఇది అర్థ‌మవుతుంది శ్రేయ‌స్ అయ్య‌ర్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ పూర్తి జ‌ట్టు:
శ్రేయాస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, నితీష్ రాణా, శివమ్ మావి, షెల్డన్ జాక్సన్, అజింక్యా రహానె, రింకూ సింగ్, అనుకుల్ రాయ్, అభిజిత్ తోమర్, ప్రథమ్ సింగ్, రసిఖ్ సలామ్, అశోక్ శర్మ, బాబా ఇందర్‌జిత్, చమికా కరుణరత్నే, సామ్ బిల్లింగ్స్, అలెక్స్ హేల్స్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, మహ్మద్ నబీ, అమన్ ఖాన్.

Story first published: Wednesday, March 2, 2022, 9:14 [IST]
Other articles published on Mar 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+