
బెంగళూరు: ఐపీఎల్ మెగా వేలం ఆసక్తికరంగా సాగుతుంది. వేలంలో ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. ఈ క్రమంలో వెస్టిండీస్ బిగ్ హిట్టర్ షిమ్రోన్ హెట్‌మయర్‌ను 8 కోట్ల 50 లక్షల రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. హెట్‌మయర్ కోసం పలు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగింది. కానీ చివరకు రాజస్థానే దక్కించుకుంది. 1.5 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో హెట్‌మయర్ వేలంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి వేలంలో హెట్‌మయర్‌కు గతంలో కంటే 75 లక్షల రూపాయలు ఎక్కువగా దక్కాయి. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన షిమ్రోన్ హెట్‌మయర్‌కు ఆ జట్టు 7 కోట్ల 75 లక్షల రూపాయలు చెల్లించింది.
కాగా ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ దూకుడే కనబరుస్తుంది. వేలం ఆరంభంలోనే టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఆ జట్టు 5 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను ఏకంగా 8 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఇక మిగతా ఆటగాళ్ల విషయానికొస్తే సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడను పంజాబ్ కింగ్స్ 9 కోట్ల 25 లక్షల రూపాయల భారీ ధరకు దక్కించుకుంది. ఇక టీమిండియా యువ బ్యాటర్‌ను శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైండర్స్ 12 కోట్ల 25 లక్షల రూపాయల ధర వెచ్చించి కొనుగోలు చేసింది. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని గుజరాత్ టైటాన్స్ 6 కోట్ల 25 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.