
సన్‌రైజర్స్‌లోకి ధావన్
టీమిండియా ఎడమ చేతి సీనియర్ ఓపెనర్ అయినా శిఖర్ ధావన్‌ను వేలంలో కోనుగోలు చేయాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం భావిస్తోందని సమాచారం. గత ఏడాది శిఖర్ ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగాడు. అయితే 36 ఏళ్ల ధావన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి తమ రిటెన్షన్ జాబితాలో చేర్చలేదు.
దీంతో ధావన్ వేలంలోకి రానున్నాడు. అయితే మంచి అనుభవం ఉన్న శిఖర్ ధావన్ జట్టులో ఉంటే బాగుంటుందని సన్‌రైజర్స్ యాజమాన్యం భావిస్తోందట. అంతేకాకుండా ఇప్పటికే టీంకు దూరమైన ఎడమ చేతి బ్యాటర్ డేవిడ్ వార్నర్ స్థానాన్ని పూడ్చాలంటే అది ధావన్‌తోనే సాధ్యమవుతుందని సన్‌రైజర్స్ బలంగా నమ్ముతుందని తెలుస్తోంది. అందుకే వేలంలో ధావన్‌ను కోనుగోలు చేయడానికి ఉన్న అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవద్దని సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ భావిస్తోందని సమాచారం.

ధర ఎంతంటే?
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం వేలంలో శిఖర్ ధావన్ 5 నుంచి 8 కోట్ల రూపాయల ధర పలికే అవకాశం ఉంది. అయితే ఆ ధరకు శిఖర్ ధావన్‌ను కచ్చితంగా కొనుగోలు చేయాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం భావిస్తోందని తెలుస్తోంది. అవరసమైతే మరిన్ని ఎక్కువ డబ్బులు పెట్టడానికైనా సరే వెనుకాడకూడదని సన్‌రైజర్స్ నిర్ణయించుకుందట. దీనికి తోడు శిఖర్ ధావన్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

గతంలో హైదరాబాద్ తరఫున..
శిఖర్ ధావన్ గతంలో హైదరాబాద్ జట్లైనా డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. 2014 నుంచి 2018 మధ్య కాలంలో 5 సంవత్సరాల పాటు ధావన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఈ క్రమంలో మంచి ఓపెనర్‌గా సత్తా చాటాడు. 2016లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో శిఖర్ ధావన్ కూడా సభ్యుడు.
ఇక 2017 సీజన్లో 36 సగటుతో 479 పరుగులు చేసి ధావన్ సత్తా చాటాడు. 2018లో 5.2 కోట్లతో ధావన్‌ను రైజర్స్ మళ్లీ కొనుగోలు చేసింది. ఆ సీజన్లో ధావన్ 497 పరుగులు సాధించాడు. ఆ తర్వాత 2019 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు.

ధావన్ రికార్డులు
ఐపీఎల్లో ఇప్పటివరకు 192 మ్యాచ్‌లు ఆడిన శిఖర్ ధావన్ 34 సగటుతో 5,783 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 106 పరుగులు. ఈక్రమంలో ధావన్ 124 సిక్స్‌లు, 654 ఫోర్లు బాదాడు. అలాగే 4 వికెట్లు కూడా తీశాడు. ఇక 2020 సీజన్లో 600, 2021 సీజన్లో 587 పరుగులతో శిఖర్ ధావన్ సత్తా చాటాడు.