Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: రోహిత్‌, కోహ్లీకి అంద‌ని రికార్డుకు చేరువ‌లో శిఖ‌ర్ ధావ‌న్.. అందుకు కావాల్సింది మ‌రో 7 ఫోర్లే!

IPL 2022: Shikhar Dhawan is 7 fours away from completing 1000 fours in T20 cricket.

కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సైతం అంద‌ని ఓ రికార్డుకు టీమిండియా వెట‌ర‌న్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ చేరువ‌లో ఉన్నాడు. టీ20 క్రికెట్లో ఇప్ప‌టివ‌ర‌కు 993 ఫోర్లు బాదిన ధావ‌న్.. మ‌రో 7 ఫోర్లు బాదితే ఈ ఫార్మాట్లో 1000 ఫోర్లు బాదిన తొలి భార‌త క్రికెట‌ర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఈ జాబితాలో 917 ఫోర్ల‌తో విరాట్ కోహ్లీ, 875 ఫోర్ల‌తో రోహిత్ శ‌ర్మ రెండు, మూడో స్థానంలో ఉన్నారు. మొత్తంగా ఈ జాబితాలో 1132 ఫోర్ల‌తో వెస్టిండీస్ దిగ్గ‌జం క్రిస్ గేల్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో ఇంగ్లండ్ ఆట‌గాడు అలెక్స్​ హేల్స్​ 1054 ఫోర్ల‌తో, మూడో స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్​ వార్నర్ 1005 ఉన్నారు.

అలాగే ఈ సీజ‌న్లో పంజాబ్ కింగ్స్ త‌ర‌ఫున ఆడుతున్న శిఖ‌ర్ ధావ‌న్ నేడు ఆ జ‌ట్టు చెన్నైసూప‌ర్ కింగ్స్‌తో ఆడనున్న మ్యాచ్‌లో బ‌రిలోకి దిగ‌నున్నాడు. దీంతో నేటి మ్యాచ్‌లో ధావ‌న్ 41 ప‌రుగులు చేస్తే చెన్నైసూప‌ర్ కింగ్స్‌పై అత్య‌ధిక పరుగులు చేసిన ఆట‌గాడిగా నిలుస్తాడు. ఇప్ప‌టివ‌ర‌కు సీఎస్కేపై 908 ప‌రుగులు చేసిన ధావ‌న్ 41 ప‌రుగులు చేస్తే ప్ర‌స్తుతం ఆ జ‌ట్టుపై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా ఉన్న‌ విరాట్ కోహ్లీ (948) ని అధిగ‌మిస్తాడు. 7 ఫోర్లు బాది 1000 ఫోర్ల రికార్డుతోపాటు ఈ రికార్డును కూడా ధావ‌న్ నేటి మ్యాచ్‌లోనే అందుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు ఇక చెన్నైసూప‌ర్ కింగ్స్‌, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య నేడు జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు గెలుపే ల‌క్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

IPL 2022: Shikhar Dhawan is 7 fours away from completing 1000 fours in T20 cricket.

తుది జ‌ట్లు (అంచ‌నా)
చెన్నైసూప‌ర్ కింగ్స్‌: రాబిన్ ఊత‌ప్ప‌, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివ‌మ్ దూబే, అంబ‌టి రాయుడు, ర‌వీంద్ర జ‌డేజా (కెప్టెన్), మ‌హేంద్ర సింగ్ ధోని (వికెట్ కీప‌ర్), డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, తుషార్ పాండే, రాజవర్ధన్ హంగర్గేకర్‌.

పంజాబ్ కింగ్స్‌: మ‌యాంక్ అగ‌ర్వాల్, శిఖ‌ర్ ధావ‌న్, బెయిర్‌స్టో, భానుక రాజ‌ప‌క్స, రాజ్ బవా, షారూక్ ఖాన్‌, హర్‌ప్రీత్ బ్రార్, ఓడియ‌న్ స్మిత్, రాహుల్ చాహ‌ర్, క‌గిసో రబాడ‌, అర్ష్‌దీప్ సింగ్.

Story first published: Sunday, April 3, 2022, 17:10 [IST]
Other articles published on Apr 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+