Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: రిష‌బ్ పంత్‌, ఎంఎస్ ధోనిలో ఉండే కామన్ పాయింట్ అదే: షేన్ వాట్స‌న్

IPL 2022: Shane Watson says there is a common point between Rishabh Pant and MS Dhoni in terms of captaincy
IPL 2022 : Rishabh Pant కెరీర్ లో ఎదగడానికి కారణం.. - Shane Watson | Oneindia Telugu

టీమిండియా వెట‌ర‌న్ వికెట్ కీప‌ర్ మ‌హేంద్ర‌సింగ్ ధోని, యువ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ మ‌ధ్య ఉన్న ఓ పోలిక‌ను ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండ‌ర్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్స‌న్ బ‌య‌ట‌పెట్టాడు. సాధార‌ణంగా అంతా యాపిల్‌ను యాపిల్‌తో పోల్చ‌మ‌ని కోరుతుంటార‌ని చెప్పాడు. రిష‌బ్ పంత్, మ‌హేంద్ర సింగ్ ధోని వేర్వేరు శైలిలో ఆడే క్రికెట‌ర్ల‌ని చెప్పిన వాట్స‌న్.. ఇద్ద‌రిలోనూ అద్భుత‌మైన టాలెంట్ ఉంద‌ని కొనియాడాడు. క్రికెట్‌లో ప్ర‌తి ఒక్క‌రు వ్య‌క్తిగ‌త నైపుణ్యం కల్గి ఉంటార‌ని చెప్పుకొచ్చాడు.

అయితే రిష‌బ్ పంత్ కెప్టెన్‌గా చాలా కూల్‌గా, నిశ్శ‌బ్దంగా ఉంటాడ‌ని, ధోని కూడా అచ్చం ఇలాగే ఉంటాడ‌ని తెలిపాడు. వీరిద్ద‌రి మ‌ధ్య కామ‌న్‌గా ఉన్న ల‌క్ష‌ణం ఇదేన‌ని ఆయ‌న చెప్పాడు. ఐపీఎల్‌లో ధోని నాయ‌క‌త్వంలో ఆడిన షేన్ వాట్స‌న్.. ప్ర‌స్తుతం రిష‌బ్ పంత్ కెప్టెన్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా ప‌ని చేస్తున్నాడు.

ఇక రిష‌బ్ పంత్‌పై షేన్ వాట్స‌న్ ప్ర‌శంస‌లు కురిపించాడు. చిన్ప వ‌య‌సులోనే పంత్ సాధించింది చూస్తుంటే న‌మ్మ‌శ‌క్యంగా లేద‌ని అన్నాడు. త‌న అనుభ‌వాలతో ఎప్పటిక‌ప్పుడు నేర్చుకునే గుణం రిషబ్ పంత్‌కు ఉంద‌ని తెలిపాడు. పంత్ ప్ర‌తిరోజూ ఏదో ఒకటి కొత్త‌గా నేర్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడ‌ని, అదే అత‌డిని ఈ స్థాయికి తీసుకొచ్చింద‌ని వివ‌రించాడు. ఇక ఢిల్లీ క్యాపిట‌ల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌పై కూడా షేన్ వాట్స‌న్ ప్ర‌శంస‌లు కురిపించాడు. తాను ఆడిన అత్యుత్త‌మ కెప్టెన్ల‌లో పాంటింగ్ ఒక‌డ‌ని వెల్ల‌డించాడు. ఉత్త‌మ ఆటగాళ్ల‌ను ఎలా త‌యారు చేయాలో పాంటింగ్‌కు బాగా తెలుస‌ని తెలిపాడు. కాగా ఐపీఎల్‌లో 2022 ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌మ తొలి మ్యాచ్‌ను ఈ నెల 27న ముంబై ఇండియ‌న్స్‌తో ఆడ‌నుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టు
పృథ్వీ షా, అన్రిచ్ నార్ట్జే, రిషబ్ పంత్ (కెప్టెన్‌), అక్షర్ పటేల్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, కుల్దీప్ యాదవ్, అశ్విన్ హెబ్బార్, సర్ఫరాజ్ ఖాన్, కమలేష్ నగర్‌కోటి, కెఎస్ భరత్, మన్‌దీప్ సింగ్, అహ్మద్, చేతన్ సకారియా, లలిత్ యాదవ్, రిపాల్ పటేల్, యష్ ధుల్, రోవ్‌మన్ పావెల్, ప్రవీణ్ దూబే, లుంగి ఎన్‌గిడి, టిమ్ సీఫెర్ట్, విక్కీ ఓస్త్వాల్.

Story first published: Wednesday, March 23, 2022, 15:07 [IST]
Other articles published on Mar 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+