Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్‌కు బిగ్ రిలీఫ్: కావ్యా పాప ఫేవరెట్ ఆల్‌రౌండర్ చేరిక: సుందర్ లేని లోటు తీరినట్టే

IPL 2022: Sean Abbott joins SRH after quarantine and all set to be available for match against KKR

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గాడిన పడింది. వరుసగా రెండు విజయాలను అందుకుంది. తాను ఆడిన మూడు, నాలుగు మ్యాచ్‌లల్లో ప్రత్యర్థులను చిత్తు చేసింది. ప్రత్యేకించి- హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తోన్న గుజరాత్ టైటాన్స్‌ జైత్రయాత్రకు బ్రేకులు వేసింది. ఆల్‌రౌండర్ ప్రతిభను ప్రదర్శించిందీ టీమ్. గుజరాత్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. నాలుగు మ్యాచ్‌లల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. శుక్రవారం తన తదుపరి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఢీ కొట్టనుంది.

ఈ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని విఘాతం తగిలిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టు దూరం అయ్యాడు. గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండట్లేదు. కనీసం రెండు వారాల పాటు అతను విశ్రాంతి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు వారాల వ్యవధిలో జరిగే మ్యాచ్‌లల్లో వాషింగ్టన్ సుందర్ ఆడకపోవచ్చు. ఎంత లేదనుకున్నా మూడు మ్యాచ్‌లను అతను మిస్ కావచ్చని మేనేజ్‌మెంట్ అంచనా వేస్తోంది.

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. ఫలితంగా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయాడు. మూడు ఓవర్లే వేశాడు. అర్ధాంతరంగా డ్రెస్సింగ్‌రూమ్‌కు చేరుకున్నాడు. మిగిలిన ఆ ఒక్క ఓవర్‌ను ఎయిడెన్ మార్క్‌రమ్ పూర్తి చేశాడు. సుందర్ కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలు మధ్య గాయం అయినట్లు సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది.

ఈ పరిణామాల మధ్య బిగ్ రిలీఫ్ లభించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆల్‌రౌండర్ సీన్ అబాట్ జట్టుతో చేరాడు. ట్రైనింగ్ సెషన్స్‌కు అటెండ్ అయ్యాడు. మూడు రోజుల పాటు క్వారంటైన్ కాలాన్ని ముగించుకున్న అతను నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్- తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌పై పోస్ట్ చేసింది. మెగా వేలం పాట సందర్భంగా 2.40 కోట్ల రూపాయలకు కావ్యా మారన్ అతన్ని జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తరువాతి మ్యాచ్‌ను శుక్రవారం ఆడబోతోంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఢీ కొట్టబోతోంది. ముంబై బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ఆరంభమౌతుంది. ఈ మ్యాచ్‌లో సీన్ అబాట్ అందుబాటులో ఉంటాడు. మేనేజ్‌మెంట్ అతణ్ని తుది జట్టులోకి తీసుకుంటుందా? లేక విశ్రాంతి ఇస్తుందా? అనేది తేలేది ఆ రోజే. వాషింగ్టన్ సుందర్ లేకపోవడం వల్ల సీన్ అబాట్‌ను తీసుకోవడం వైపే మొగ్గు చూపొచ్చు.

Story first published: Wednesday, April 13, 2022, 16:02 [IST]
Other articles published on Apr 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+