Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చివరి ఓవర్లో తన ప్లాన్ ఏంటో చెప్పిన డానియల్ సామ్స్

Sams was able to bowl in the last over as planned and the results came

గుజరాత్ టైటాన్స్‌పై ముంబై ఇండియన్స్‌కు నిన్న థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఆఖరి ఓవర్‌లో ముంబై 8పరుగులు డిఫెండ్ చేసుకోవాల్సిన తరుణంలో బరిలోకి దిగిన బౌలర్ డేనియల్ సామ్స్ అద్భుతమైన వైడ్ ఆఫ్ సైడ్ డెలివరీలతో ఆకట్టుకుని కేవలం 3పరుగులు మాత్రమే ఇచ్చి ముంబైకి విజయాన్ని అందించాడు. తొలుత 178 పరుగుల ఛేదనలో గుజరాత్ టైటాన్స్ సునాయసంగా గెలిచేలా కన్పించింది. ఇక చివరి ఓవర్లో కేవలం 8పరుగులు మాత్రమే చేయాల్సిన పరిస్థితి. అప్పుడు డానియల్ సామ్స్ బరిలోకి దిగాడు. క్రీజులో రాహుల్ తెవాతీయా, డేవిడ్ మిల్లర్ లాంటి ఫినిషర్లు ఉన్నారు. తొలి బంతికి మిల్లర్ ఒక రన్ తీశాడు. రెండో బంతికి తేవాతియా షాట్ ఆడగా బంతి మిస్సయింది. డాట్ బాల్ వచ్చింది. మూడో బంతికి తెవాతీయా షాట్ ఆడి రెండో రన్ తీసే క్రమంలో రనౌట్ అయ్యాడు. నాలుగోబంతికి రషీద్ ఖాన్ హిట్ చేయగా.. సామ్స్ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు కానీ అందుకోలేకపోయాడు. ఒక రన్ వచ్చింది. చివరి రెండు బంతులను మిల్లర్ ఎదుర్కొన్నాడు. ఆ రెండింటిని హాఫ్ సైడ్ వేసిన సామ్స్ స్లో టెక్నిక్ ఉపయోగించాడు. అవి మిల్లర్ బ్యాట్‌కు కూడా తాకలేదు. దీంతో 5పరుగుల తేడాతో ముంబై గెలుపొందింది.

ఇక ఈ మ్యాచ్ అనంతరం డేనియల్ సామ్స్ మాట్లాడుతూ.. వైడ్ ఆఫ్ సైడ్ బాల్స్‌ను బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగానని, డేవిడ్ మిల్లర్, తెవాతీయా లాంటి ప్రమాదకరమైన బ్యాటర్లకు బౌలింగ్ చేసినప్పుడు తన స్లోయర్ బాల్స్ ఫలితాన్నిచ్చాయని పేర్కొన్నాడు. డేనియల్ సామ్స్ చివరి ఓవర్‌లో 3 పరుగులతో సహా 3-0-18-0ప్రదర్శనతో బౌలింగ్ చేశాడు. 10 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుండి ముంబై నిష్క్రమించినప్పటికీ మిగిలిన మ్యాచ్‌ల్లో సత్తా చాటుతామని సామ్స్ చెప్పాడు.

Sams was able to bowl in the last over as planned and the results came

సామ్స్ మాట్లాడుతూ.. 'చివరి ఓవర్లో మేం ఆ క్రాస్ లైన్‌ను అధిగమించడం అద్భుతంగా ఉంది. ఇంత మంది అభిమానుల ఆనందాన్ని చూడటం సంతోషాన్నిచ్చింది. గుజరాత్ 6బంతుల్లో 9పరుగులు చేయాల్సిన తరుణంలో.. తొలుత మేం చేయగలిగేది ఏముంటుంది. ఓ వైపు హిట్టర్లు ఉన్నారు, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది అనిపించింది. అయినా కానీ మేం కోల్పోయింది ఏమీ లేదనిపించింది. అయితే నా ప్లాన్ మాత్రం నేను ట్రామ్‌లైన్‌లో కొన్ని వైడ్ ఆఫ్ సైడ్ బంతులను వేయాలని ఫిక్సయ్యా. ఏదైతే అది అయింది. నా ప్లాన్‌ను నమ్ముకున్నా. దాన్ని బాగా అమలు చేయగలిగాను. నేను వేయగలిగే అత్యుత్తమ బంతులకు కట్టుబడి ఉండటమే నా అంతిమ లక్ష్యం. మిగితాది బ్యాటర్ల టచ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే బౌలింగ్లో స్లో వేరియేషన్ చూపించాను. అది ఫలితాన్నిచ్చింది.' అని సామ్స్ పేర్కొన్నాడు.

Story first published: Saturday, May 7, 2022, 10:30 [IST]
Other articles published on May 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+