Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ruturaj Gaikwad: ఒక్క ఇన్నింగ్స్‌తో రికార్డుల పరంపర.. సచిన్ రికార్డ్ సమం చేసిన గైక్వాడ్

IPL 2022: Ruturaj Gaikwad set rare records with an innings against the Sunrisers

తిరిగి ధోనీ సారథ్య బాధ్యతలు స్వీకరించిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ విజయాల బాట పట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 99), డేవాన్ కాన్వే(55 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 85 నాటౌట్) చెలరేగి ఆడడంతో 202పరుగుల భారీ స్కోరు చేసింది. తదనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ 6వికెట్లు కోల్పోయి 189పరుగులు మాత్రమే చేయగలిగింది.

దీంతో చెన్నై 13పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ హైలెట్ అని చెప్పాలి. తృటి‌లో సెంచరీ చేజార్చుకున్నా.. కాన్వేతో కలిసి తొలి వికెట్‌కు 182పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో తన ఇన్నింగ్స్ ద్వారా పలు మైలురాళ్లను రుతురాజ్ చేరుకున్నాడు.

1000‌పరుగుల మైలురాయి

1000‌పరుగుల మైలురాయి

రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్లో పూర్తిగా తడబడ్డాడు. ఇక గైక్వాడ్ తిరిగి ఫామ్ పుంజుకుంటాడన్న ఆశలు కూడా సన్నగిల్లిన దశలో ధోనీ సారథ్యంలో భీకరంగా చెలరేగిపోయాడు. మైదానం నలువైపులా ఫోర్లు, సిక్సర్లతో నిన్నటి మ్యాచ్‌లో సన్ రైజర్స్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఈక్రమంలో ఐపీఎల్లో 1000పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.కేవలం 31ఇన్నింగ్స్‌లలోనే అతను వెయ్యి పరుగులు సాధించాడు.

తద్వారా సచిన్ రికార్డును సమం చేశాడు. సచిన్ సైతం 31ఇన్నింగ్స్‌లలోనే 1000రన్స్ ఘనత సాధించాడు. అలాగే అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 10కంటే ఎక్కువ సార్లు హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గానూ నిలిచాడు. 31ఇన్నింగ్స్‌లో రుతురాజ్ 10హాఫ్ సెంచరీలు చేయగా.. 38ఇన్నింగ్స్‌లలో సచిన్ టెండూల్కర్, 40ఇన్నింగ్స్‌లలో శ్రేయస్ అయ్యర్ 10హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా ఉన్నారు.

31 ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా..

31 ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా..

రుతురాజ్ గైక్వాడ్ చెన్నై జట్టుకు ఆడిన కొత్తలో మిడిలార్డర్లో దిగాడు. వరుసగా నిరాశపర్చుతున్న అతన్ని ధోనీ పసిగట్టాడు. ప్రాక్టీసు సెషన్లో అతని బ్యాటింగ్ నైపుణ్యం చూశాడు. అటాక్ చేయగల సమర్థుడని భావించి.. అతన్ని ఓపెనర్‌గా పంపాడు. ఓపెనర్‌గా క్లిక్కయ్యాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న రుతురాజ్ 2020 సెకండాఫ్ సీజన్లో, 2021 సీజన్లో చెలరేగి ఆడాడు.

ఈ క్రమంలో 31 ఇన్నింగ్స్‌లలో ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. 31ఇన్నింగ్స్‌లలో రుతురాజ్ గైక్వాడ్ 1076పరుగులు చేయగా.., సచిన్ 1064పరుగులు, దేవదత్ పడిక్కల్ 932, సురేశ్ రైనా 928, గౌతం గంభీర్ 901పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అత్యధిక భాగస్వామ్యంలోనూ రికార్డ్

అత్యధిక భాగస్వామ్యంలోనూ రికార్డ్

సన్ రైజర్స్ హైదరాబాద్‌తో నిన్నటి మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే చెన్నై తరఫున ఓపెనింగ్ కు దిగి విధ్వంసం రేపిన సంగతి తెలిసిందే. వీరిద్దరు తొలి వికెట్‌కు 182పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరి జోడీని నట్టూ విడగొట్టాడు. అయితే ఐపీఎల్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా వీరి జోడి 4వ స్థానంలో నిలిచింది.

ఈ జాబితాలో వార్నర్ - బెయిర్ స్టో (185) వర్సెస్ ఆర్సీబీ, గంభీర్ - క్రిస్ లిన్ (184) వర్సెస్ గుజరాత్ లయన్స్, కేఎల్ రాహుల్ - మయాంక్ అగర్వాల్ (183) వర్సెస్ ఆర్ఆర్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్ 2020 సీజన్ నుంచి ఇప్పటివరకు అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందిన వారిలో రుతురాజ్ (8), కేఎల్ రాహుల్ (8) తొలిస్థానంలో ఉన్నారు.

Story first published: Monday, May 2, 2022, 8:03 [IST]
Other articles published on May 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+