For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: ఆరెంజ్ క్యాప్ హీరో రుతురాజ్ గైక్వాడ్ వ‌చ్చేశాడు.. ఫుల్ జోష్‌లో సీఎస్కే

IPL 2022: Ruturaj Gaikwad joins Chennai Super Kings camp for IPL 15

ఇండియ‌న్ ప్రీమియ‌ల్ లీగ్ (ఐపీఎల్) 2022 ప్రారంభ‌మ‌వ‌డానికి మ‌రో 10 రోజుల స‌మ‌యం ఉంది. కానీ అప్పుడే ఐపీఎల్ ఫీవ‌ర్ ప్రారంభ‌మైపోయింది. ఆట‌గాళ్లంతా త‌మ త‌మ జ‌ట్ల‌లో చేరుతుండ‌డంతో ఐపీఎల్ శోభ క‌నిపిస్తోంది. అలాగే టీంల‌న్నీ త‌మ ప్రాక్టీసును కూడా ప్రారంభించాయి. ప్ర‌త్యేకంగా ప్రాక్టీస్ సెష‌న్స్ నిర్వ‌హించి క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే 2021 ఐపీఎల్ సీజ‌న్లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న రుతురాజ్ గైక్వాడ్ కూడా త‌న టీం చెన్నైసూప‌ర్ కింగ్స్‌లో చేరిపోయాడు.

దీనికి సంబంధించిన విష‌యాన్ని సీఎస్కే త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా వెల్ల‌డించింది. కాగా గ‌త సీజ‌న్లో 635 ప‌రుగుల‌తో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రుతురాజ్ గైక్వాడ్ నిలిచాడు. ఈ క్ర‌మంలోనే ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.చెన్నైసూప‌ర్ కింగ్స్ గ‌త టైటిల్ గెల‌వ‌డంతో రుతురాజ్ గైక్వాడ్ కీల‌క పాత్ర పోషించాడు.

ఐపీఎల్ 2022లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నైసూప‌ర్ కింగ్స్ త‌మ తొలి మ్యాచ్‌ను కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో ఆడ‌నుంది. ఈ మ్యాచ్ ఈ నెల 26న జ‌ర‌గ‌నుంది. ఇక రెండో మ్యాచ్ 31న పుణే సూప‌ర్ జెయింట్స్‌తో ఆడ‌నుంది. ఏప్రిల్ 3న పంజాబ్ కింగ్స్‌తో, 9న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో, 12న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో, 17న గుజ‌రాత్ టైటాన్స్‌తో, 21న ముంబై ఇండియ‌న్స్‌తో, 25న పంజాబ్ కింగ్స్‌తో, మే 1న స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్‌తో, 4న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో, 8న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో, 12న ముంబై ఇండియ‌న్స్‌తో, 15న గుజ‌రాత్ టైటాన్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇక త‌మ చివ‌రి మ్యాచ్‌ను 20న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ఆడ‌నుంది.

చెన్నైసూప‌ర్ కింగ్స్ పూర్తి స్క్వాడ్

IPL 2022 : This Star Player Can Replace Deepak Chahar In IPL 2022 | Oneindia Telugu

మ‌హేంద్ర సింగ్‌ ధోనీ (12 కోట్లు), రవీంద్ర జడేజా(16 కోట్లు), మొయిన్‌ అలీ 8 కోట్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌( 6 కోట్లు), దీపక్‌ చాహర్‌( 14 కోట్లు), అంబటి రాయుడు(6.75 కోట్లు), డ్వేన్ బ్రావో (ఓవర్సీస్‌-4.40 కోట్లు), శివమ్ దూబే( 4 కోట్లు), క్రిస్‌ జొర్డాన్‌( 3.60 కోట్లు), రాబిన్ ఉతప్ప(2 కోట్లు), మిచెల్ సాంట్నర్ (ఓవర్సీస్ 1.90కోట్లు), ఆడమ్ మిల్నే (ఓవర్సీస్‌- 1.90 కోట్లు), విక్రమ్‌ సోలంకి(1.20 కోట్లు), రాజ్‌వర్థన్‌(1.50 కోట్లు), డేవన్‌ కాన్వే (ఓవర్సీస్‌- రూ. కోటి), మహీష్ తీక్షణ (ఓవర్సీస్ 70 లక్షలు), ప్రిటోరియస్ (ఓవర్సీస్ 50 లక్షలు), కేఎమ్‌ అసిఫ్, తుషార్‌ దేశ్‌పాండే, సిమర్‌జీత్‌ సింగ్, శుభ్రాన్ష్‌ సేనాపతి, ముకేశ్‌ చౌధరి, జగదీశన్‌, హరి నిషాంత్‌( వీరంద‌రికీ 20 లక్షలు)

Story first published: Wednesday, March 16, 2022, 16:54 [IST]
Other articles published on Mar 16, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+