
చెన్నైసూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. గత సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడంతోపాటు సీఎస్కే ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ జట్టుతో కలిశాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ ప్రకటించారు. కాగా శ్రీలంకతో సిరీస్‌కు ముందు గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడంపై అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా విశ్వనాథన్ ప్రకటనతో సీఎస్కే ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రుతురాజ్ గైక్వాడ్ ఫిట్‌నెస్ పరీక్షల్లో సఫలమయ్యాడని, ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నాడని విశ్వనాథన్ తెలిపాడు. త్వరలోనే ప్రాక్టీస్ కూడా మొదలుపెడతాడని, తొలి మ్యాచ్ ఆడతాడని ఆయన స్పష్టం చేశాడు.
కాగా సూపర్ బ్యాటింగ్‌తో చెన్నైసూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గత సీజన్లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. 2021 ఐపీఎల్ సీజన్ మొత్తంలో రుతురాజ్ గైక్వాడ్ 16 మ్యాచ్‌ల్లో 635 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 23 మ్యాచ్‌లాడిన రుతురాజ్ గైక్వాడ్ 46 సగటుతో 839 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 101 పరుగులుగా ఉంది. అయితే సీఎస్కే మరో స్టార్ ప్లేయర్ మొయిన్ అలీ మాత్రం తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీసా సమస్యలతో అలీ ఇంకా ఇండియా చేరుకోలేదు. దీంతో అలీ సమస్య తొలగిపోవడానికి మరింత సమయం పట్టేలా ఉంది. దీంతో అతను తొలి మ్యాచ్ నాటికి జట్టులో చేరే అవకాశాలు కనిపించడం లేదు.
చెన్నైసూపర్ కింగ్స్ పూర్తి జట్టు
మహేంద్ర సింగ్ ధోనీ (12 కోట్లు), రవీంద్ర జడేజా(16 కోట్లు), మొయిన్ అలీ 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్( 6 కోట్లు), దీపక్ చాహర్( 14 కోట్లు), అంబటి రాయుడు(6.75 కోట్లు), డ్వేన్ బ్రావో (ఓవర్సీస్-4.40 కోట్లు), శివమ్ దూబే( 4 కోట్లు), క్రిస్ జొర్డాన్( 3.60 కోట్లు), రాబిన్ ఉతప్ప(2 కోట్లు), మిచెల్ సాంట్నర్ (ఓవర్సీస్ 1.90కోట్లు), ఆడమ్ మిల్నే (ఓవర్సీస్- 1.90 కోట్లు), విక్రమ్ సోలంకి(1.20 కోట్లు), రాజ్‌వర్థన్(1.50 కోట్లు), డేవన్ కాన్వే (ఓవర్సీస్- రూ. కోటి), మహీష్ తీక్షణ (ఓవర్సీస్ 70 లక్షలు), ప్రిటోరియస్ (ఓవర్సీస్ 50 లక్షలు), కేఎమ్ అసిఫ్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, శుభ్రాన్ష్ సేనాపతి, ముకేశ్ చౌధరి, జగదీశన్, హరి నిషాంత్( వీరందరికీ 20 లక్షలు)