Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022 Finals: టైటిల్ ఫైట్ ఆ రెండు జట్ల మధ్యే..క్రికెట్ జ్యోతిష్యుల భవిష్యవాణి ఇదే

IPL 2022, RR vs RCB: Here is the details of majority twitter users of final match predictions

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌ లీగ్ దశ చివరికొచ్చింది. ఈ సాయంత్రం జరిగే మ్యాచ్ చిట్టచివరిది. సన్‌రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇక- ప్లేఆఫ్స్ ఆరంభమౌతాయి. ఎలిమినేటర్, క్వాలిఫయర్స్ పోరు మొదలవుతుంది. ఎల్లుండి తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఉంటుంది. సాయంత్రం 7:30 గంటలకు కోల్‌కత ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక. టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్..రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది.

నాలుగో స్లాట్ బుక్..

తొలి ఎలిమినేటర్ బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. లక్నో సూపర్ జెయింట్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ కొంటాయి. ఈ మూడు జట్లు ఇదివరకే ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. శనివారం రాత్రి వాంఖెడె స్టేడియంలో ముంబై ఇండియన్స్-ఢిల్లీ కేపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం నాలుగో స్లాట్ ఎవరిదనేది ఖరారైంది. ఈ నాలుగో స్లాట్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బుక్ చేసుకుంది. ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓడిపోవడంతో ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయింది ఢిల్లీ కేపిటల్స్.

ప్లేఆఫ్స్‌కు చేరిన టీమ్స్ ఇవే..

నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు అడుగు పెట్టాయి. ఈ సీజన్‌తో తమ ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ ఆడనున్నాయి. ఈ రెండు జట్లు కూడా తమ ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. పాయింట్ల పట్టికలో తొలి, మూడో స్థానంలో నిలిచాయి. ఈ రెండింటితో పాటు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి.

ఫైనల్స్ చేరేది ఎవరు..

ఇవి ఎలా ఉన్నప్పటికీ.. ఫైనల్స్‌పై అంచనాలు మొదలయ్యాయి. ఫైనల్స్‌లో ఢీ కొట్టబోయేది ఎవరో అప్పుడే జోస్యం కూడా చెబుతున్నారు అభిమానులు. ఫైనల్స్‌పై భవిష్య వాణిని వినిపిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఫైనల్స్ చేరుతాయని అంచనా వేస్తోన్నారు క్రికెట్ పండితులు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ వేదికగా.. తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. RR vs RCB అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌ అవుతోంది.

అంచనాలను అందుకోలేని కొత్త జట్లు..

ఈ సీజన్‌తోనే తమ ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌.. అభిమానులను అంచనాలను అందుకోలేకపోతున్నాయి. ఈ రెండు జట్లు కూడా ఫైనల్స్‌కు అర్హత సాధించలేవని తేల్చి చెబుతున్నారు ఫ్యాన్స్. ఎలిమినేటర్, క్వాలిఫయర్ దశలోనే ఈ రెండు జట్లు కూడా ఓడిపోతాయని చెప్పకనే చెబుతున్నారు. ఈ రెండు జట్లు కూడా ప్లేఆఫ్స్‌లో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించలేకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్లే ఆఫ్స్ ఆడిన అనుభవం ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్.. అలవోకగా ఫైనల్స్ చేరుతాయని అంటున్నారు.

ఎల్లుండే తొలి క్వాలిఫయర్..

తొలి క్వాలిఫయర్ ఈ నెల 24వ తేదీన మంగళవారం ఉంటుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్, సంజు శాంసన్ నాయకత్వాన్ని వహిస్తోన్న రాజస్థాన్ రాయల్స్.. తొలి క్వాలిఫయర్‌లో తలపడతాయి. సాయంత్రం 7:30 గంటలకు కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. రెండో క్వాలిఫయర్‌లో ఆడుతుంది.

నాకౌట్ మ్యాచ్..

25వ తేదీన బుధవారం నాడు ఎలిమినేటర్. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ కొట్టనున్నాయి. ఈ మ్యాచ్ నాకౌట్‌తో సమానం. ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి వైదొలగిపోతుంది. గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్‌ను ఎదుర్కొనాల్సి ఉంటుంది. తొలి క్వాలిఫయర్‌లో గెలిచిన జట్టుతో తలపడుతుంది. అందులో గెలిస్తేనే- ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. రెండో క్వాలిఫయర్- ఏ జట్ల మధ్య ఉంటుందనేది ఈ రెండు మ్యాచ్‌లు ముగిసిన తరువాతే స్పష్టమౌతుంది. రెండో క్వాలిఫయర్ ఈ నెల 27వ తేదీన ఉంటుంది.

Story first published: Sunday, May 22, 2022, 9:59 [IST]
Other articles published on May 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+