Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కింగ్ కోహ్లీని అలా చూస్తోంటే గుండె తరుక్కుపోతోందిగా: కష్టకాలంలో అండగా ఫ్యాన్స్

IPL 2022, RR vs RCB: Fans backs Virat Kohli despite batting failure in this season

ముంబై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని చవి చూసింది. ఐపీఎల్ 2022లో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైంది. ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యం చిన్నదే అయినప్పటికీ.. దాన్ని ఛేదించలేకపోయింది. ఏకంగా 29 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో రాయల్ ఛాలెంజర్స్ స్థానం మరింత దిగజారింది. అయిదో స్థానానికి పడిపోయింది. ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచ్‌లల్లో నాలుగింట్లో ఓడింది.

విరాట్ ఫెయిల్యూర్

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఫెయిల్యూర్ కంటిన్యూ అవుతూనే ఉంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చినప్పటికీ.. పెద్దగా ఫలితం కనిపించలేదు. సాధారణంగా వన్‌డౌన్‌లో వచ్చే విరాట్ కోహ్లీ- రాజస్థాన్‌పై మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలో దిగాడు. అనూజ్ రావత్ స్థానంలో బ్యాట్ అందుకున్నాడు. కేప్టెన్ ఫాప్ డుప్లెసిస్‌తో కలిసి ఇన్నింగ్ ఆరంభించాడు. ఈ ప్రయోగం బెడిసికొట్టింది. మరోసారి గోల్డెన్ డక్‌ను ఎదుర్కొనబోయి తృటిలో తప్పించుకున్నాడు. అయినప్పటికీ ఎక్కువసేపు క్రీజ్‌లో నిలదొక్కుకోలేదు.

తొలి వికెట్ విరాట్‌దే..

145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ ఇన్నింగ్‌లో తొలి వికెట్ విరాట్ కోహ్లీదే. జట్టు స్కోరు 10 పరుగుల వద్ద అతను అవుట్ అయ్యాడు. తొమ్మిది పరుగులే చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతిని షాట్ ఆడగా.. గాల్లోకి లేచిన ఆ బంతిని రియాన్ పరాగ్ డైవ్ చేసి మరీ అందుకన్నాడు. ఆ తరువాత ఛాలెంజర్స్ బ్యాటింగ్ తడబడింది. వరుసగా వికెట్లు పడ్డాయి. సగటున ప్రతి 10 పరుగులకు ఓ వికెట్ పడింది. 115 పరుగులకు కుప్పకూలింది.

కోహ్లీ మళ్లీ మళ్లీ..

బ్యాటింగ్ కింగ్ కోహ్లీ ఫామ్‌ను అందిపుచ్చుకోవట్లేదు. తొలి, నాలుగో మ్యాచ్‌లల్లో మాత్రమే అతను రాణించాడు. 40 ప్లస్ స్కోర్ చేశాడు. మిగిలిన అన్నింట్లో సింగిల్ డిజిట్సే ఎక్కువ. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అతను చేసిన స్కోర్స్.. 41 (నాటౌట్), 12, 5, 48, 1, 12, 0, 0, 9. ఈ వైఫల్యాలు అటు విరాట్ కోహ్లీనే కాదు.. అతని అభిమానులను కూడా తీవ్ర నిరాశకు గురి చేస్తోన్నాయి. అవుట్ అయిన తరువాత కోహ్లీ నిర్వేదంతో నవ్వే నవ్వు.. ఫ్యాన్స్‌ను గుండె తరుక్కుపోయేలా చేస్తోంది.

కష్టకాలంలో అండగా..

తమ ఆరాధ్య క్రికెటర్ వరుసగా విఫలమౌతున్న సమయంలో అభిమానులు అతనికి అండగా ఉంటున్నారు. కింగ్ కోహ్లీ.. మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడని నమ్ముతున్నారు. ఒక్క భారీ ఇన్నింగ్ ఆడితే చాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వైఫల్యాలను ఎదుర్కొన్న ప్రతీసారీ కోహ్లీ- అద్భుతంగా దూసుకొచ్చాడని, ఇప్పుడూ అదే జరుగుతుందని భావిస్తున్నారు. అది ఈ సీజన్‌లోనే చూస్తామని, నెక్స్ట్ మ్యాచ్‌లో కోహ్లీ భారీ ఇన్నింగ్ ఆడుతాడని ఆశిస్తున్నారు.

Story first published: Wednesday, April 27, 2022, 8:09 [IST]
Other articles published on Apr 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+