Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs RCB: డుప్లిసెస్ vs చాహ‌ల్‌.. చాహ‌ల్ బౌలింగ్‌లో డుప్లిసెస్‌కు చెత్త రికార్డులు

ipl 2022: RR vs RCB: Du Plessis vs Chahal.. Du plessis worst records in chahal Bowling

ఐపీఎల్ 2022లో మంగ‌ళ‌వారం ఆస‌క్తిక‌ర పోరు జ‌ర‌గ‌నుంది. నేటి మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. రాత్రి 7:30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభ‌మ‌వుతుంది. అయితే ఈ మ్యాచ్‌లోని ప్ర‌ధాన ఆట‌గాళ్ల మ‌ధ్య గ‌త రికార్డులు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఈ క్ర‌మంలో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లిసెస్‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బౌల‌ర్ య‌జుర్వేంద్ర చాహ‌ల్‌లో బౌలింగ్‌లో ఫేల‌వ రికార్డులు ఉన్నాయి. ఈ ఫేల‌వ రికార్డులు ఆర్సీబీ ఫ్యాన్స్‌ను క‌ల‌వ‌రపెడుతున్నాయి.

ఐపీఎల్‌లో చాహ‌ల్ బౌలింగ్‌లో ఇప్పటివ‌ర‌కు 30 బంతులు ఎదుర్కొన్న డుప్లిసెస్ కేవ‌లం 80 స్ట్రైక్ రేట్‌తో 24 ప‌రుగులు చేశాడు. చాహ‌ల్ బౌలింగ్‌లో ఒక్క బౌండ‌రీ కూడా బాద‌లేక‌పోయిన డుప్లిసెస్ ఒక సారి ఔట్ అయ్యాడు. దీంతో నేటి మ్యాచ్‌లో కూడా డుప్లిసెస్‌పై చాహ‌ల్ అధిప‌త్యం చెలాయిస్తే రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని భావించాలి. దీంతో నేటి మ్యాచ్‌లో చాహ‌ల్‌ను ధీటుగా ఎదుర్కొన్న అత‌ని బౌలింగ్‌లో ఉన్న చెత్త రికార్డుల‌ను డుప్లిసెస్ మెరుగుప‌ర‌చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా గ‌త సీజ‌న్ వ‌ర‌కు య‌జుర్వేంద్ర చాహ‌ల్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకే ప్రాతిధ్యం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అలాగే డుప్లిసెస్ కూడా గ‌త సీజ‌న్ వ‌ర‌కు చెన్నైసూప‌ర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు.

పూర్తి జ‌ట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ (వికెట్ కీప‌ర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, సిద్దార్థ కౌల్, కర్ణ్ శర్మ , చామ వి మిలింద్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, ఫిన్ అలెన్, సుయాష్ ప్రభుదేసాయి, గ్లెయిన్ మాక్స్‌వెల్, అనీశ్వర్ గౌతమ్.

రాజస్థాన్ రాయల్స్:
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్‌/ వికెట్ కీప‌ర్‌), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, కరుణ్ నాయర్, జేమ్స్ నీషమ్, రాస్సీ డెర్ దుస్సేన్, కెసి కరియప్ప, డారిల్ మిచెల్, ఒబెడ్ మెక్‌కాయ్, తేజస్ బరోకా, కుల్దీప్ యాదవ్, అనునయ్ సింగ్, కుల్దీప్ సేన్, నాథన్ కౌల్టర్-నైల్, ధ్రువ్ జురెల్, శుభమ్ గర్వాల్

Story first published: Tuesday, April 5, 2022, 17:58 [IST]
Other articles published on Apr 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+