Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ విధ్వంసక బ్యాటర్‌కు భార్యే పెద్ద కోచ్.. విమర్శకురాలు కూడా

IPL 2022, RR vs KKR: My wife has been my biggest coach, says Rajasthan Royals Shimron Hetmyer

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మరో ఓటమిని అందుకుంది. సోమవారం రాత్రి ముంబై వాంఖెడె స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో ఓడింది. ఈ టోర్నమెంట్‌లో ఇది వరుసగా రెండో ఓటమి. అంతకుముందు- ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైంది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లల్లో సంజు శాంసన్ సారథ్యంలోని ఈ జట్టు ఆరింట్లో నెగ్గింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. కీలకమైన దశలో వరుసగా రెండు మ్యాచ్‌లల్లో ఓడటం ఆందోళన కలిగించే విషయమే.

ఈ పరాజయాల నుంచి వెంటనే తేరుకోలేకపోతే మాత్రం ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. ఇంకో నాలుగు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. తన తదుపరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ఉంటుంది. ముంబై వాంఖెడె స్టేడియం దీనికి వేదిక. అనంతరం ఢిల్లీ కేపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్.. చివరగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది. మూడింట్లో నెగ్గాల్సి పరిస్థితి ఉందా జట్టుకు.

సోమవారం రాత్రి నాటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కేప్టెన్ సంజు శాంసన్ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. ఓపెనర్ జోస్ బట్లర్ 22 పరుగులకే పరిమితం అయ్యాడు. షిమ్రోన్ హెట్మయిర్ 27 పరుగులు చేశాడు. హెట్మెయిర్ 13 బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో మెరుపులు మెరిపించక పోయి ఉంటే ఆ స్కోర్ కూడా దక్కేది కాదు. రియాన్ పరాగ్ అతని దూకుడుకు తోడయ్యాడు. 12 బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 19 పరుగులు చేశాడు.

ఈ సీజన్‌లో హెట్మెయిర్ దూకుడుగా ఆడుతున్నాడు. 10 మ్యాచ్‌లల్లో 260 పరుగులు చేశాడు. ఆరుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. 59 హయ్యెస్ట్ స్కోర్. 163.52 స్ట్రైక్ రేట్‌ను రికార్డ్ చేశాడు. ఐపీఎల్ మెగా వేలం పాటలో అతణ్ని 8.50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది రాయల్స్. దీనికి తగ్గట్టుగానే అతను అదరగొడుతున్నాడు. మిడిలార్డర్‌లో కీలక బ్యాటర్‌గా మారాడు. కోల్‌కత నైట్‌రైడర్స్‌పైనా దూకుడుగా ఆడాడీ వెస్టిండీస్ ప్లేయర్.

తన సక్సెస్‌కు కారణాన్ని వెల్లడించాడు. భార్యే తనకు పెద్ద కోచ్‌, విమర్శకురాలిగా వ్యాఖ్యానించాడు. అంతకుముందు తాను ఐపీఎల్‌లో పెద్దగా రాణించలేకపోయానని, ఆ సమయంలో నిర్వాణి విలువైన సూచనలు ఇచ్చిందని పేర్కొన్నాడు. గత సీజన్, ఇప్పుడూ రాణించడానికి నిర్వాణి ఇచ్చిన సజెషన్స్ కారణమని చెప్పాడు. తన లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతుంటుందని, వాటిని సరి చేసుకునే చిట్కాలను కూడా ఇస్తుంటుందని పేర్కొన్నాడు.

జోస్ బట్లర్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం తన అదృష్టమని హెట్మెయిర్ చెప్పాడు. రివర్స్ స్వీప్, స్కూప్ షాట్లను ఎలా ఆడాలో అతని వద్దే నేర్చుకుంటున్నానని, దీనిపై నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నానని పేర్కొన్నాడు.

Story first published: Tuesday, May 3, 2022, 10:07 [IST]
Other articles published on May 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+