Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs MI: రోహిత్ శ‌ర్మ vs విరాట్ కోహ్లీ.. ముంబై, బెంగ‌ళూరు హెడ్ టూ హెడ్ రికార్డులు ఇదిగో!

IPL 2022: Royal Challengers Bangalore vs Mumbai Indians Head to Head Records

ఐపీఎల్ 2022లో నేడు ఆస‌క్తిక‌ర పోరు జ‌ర‌గ‌నుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్‌, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డనున్నాయి. పుణే వేదిక‌గా రాత్రి 7:30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సీజ‌న్లో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క మ్యాచ్ కూడా గెల‌వ‌ని ముంబై ఇండియ‌న్స్ ఈ మ్యాచ్‌లో గెలుపే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజ‌యాలు సాధించిన రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఇరు జ‌ట్ల మ‌ధ్య ఉన్న రికార్డుల‌ను ఒక సారి ప‌రిశీలిస్తాం.

ఐపీఎల్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగళూరు, ముంబై ఇండియ‌న్స్ ఇప్ప‌టివ‌ర‌కు 29 మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ్డాయి. అయితే రెండు జ‌ట్ల హెడ్ టూ హెడ్ రికార్డుల్లో ముంబైదే పైచేయిగా ఉంది. ముంబై 17 మ్యాచ్‌ల్లో గెల‌వగా.. బెంగ‌ళూరు 12 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డిన మ్యాచ్‌ల్లో ఓ సారి అత్య‌ధికంగా బెంగ‌ళూరు 235 ర‌న్స్ చేయ‌గా.. ముంబై 213 ప‌రుగులు చేసింది. ఇక అత్య‌ల్పంగా బెంగ‌ళూరు 122, ముంబై 111 ప‌రుగులు చేసింది. ఇక గ‌త 5 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ 3, ముంబై 2 మ్యాచ్‌లు గెలిచాయి.

IPL 2022: Royal Challengers Bangalore vs Mumbai Indians Head to Head Records

తుది జ‌ట్లు (అంచ‌నా)
ముంబై ఇండియ‌న్స్‌:
ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్), రోహిత్ శర్మ (కెప్టెన్‌, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, అర్జున్ టెండూల్క‌ర్, డెవాల్డ్ బ్రెవిస్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి.

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు:
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెయిన్ మాక్స్‌వెల్‌, దినేష్ కార్తీక్ (వికెట్ కీప‌ర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.

Story first published: Saturday, April 9, 2022, 16:15 [IST]
Other articles published on Apr 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+