IPL 2022: సెంచరీల్లో ఆర్సీబీ టాప్.. ఏ జట్టు ఆటగాళ్లు ఎన్ని సెంచరీలు చేశారు? జాబితా ఇదిగో!

మరో 3 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ప్రారంభంకానుండడంతో క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎంతైనా క్రికెట్లో ఐపీఎల్‌కు ఉండే క్రేజే వేరు. ఐపీఎల్‌లో సెంచరీలు సాధించే బ్యాటర్లైతే హిరోలు అయిపోతారు. దీంతో క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్‌లో ఇప్పటివరకు నమోదైన సెంచరీలను లెక్కేస్తున్నారు. టీంల పరంగా ఏం టీం ఎన్ని సెంచరీలు చేసిందని లెక్కకడుతున్నారు. అలాగే సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాను కూడా అభిమానులు బయటికి తీస్తున్నారు.

ఆర్సీబీ పేరుపై అత్యధిక సెంచరీలు
ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరు మీద ఉంది. ఆ జట్టు బ్యాటర్లు లీగ్‌లో ఇప్పటివరకు 14 సెంచరీలు సాధించారు. ఇందులో అత్యధికంగా ఆ జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీ 5 సెంచరీలు సాధించగా, క్రిస్ గేల్ 4, ఏబీ డివిల్లియర్స్ 3, మనీష్ పాండే ఒక సెంచరీ చేశారు. ఇక రెండో స్థానంలో 13 సెంచరీలతో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లున్నారు. ఆ టీం ఆటగాళ్లు 13 సెంచరీలు సాధించారు. ఇందులో క్రిస్ గేల్, హషీమ్ ఆమ్లా, కేఎల్ రాహుల్ రెండేసి సెంచరీలు చేశారు. షాన్ మార్ష్, మహేల జయవర్ధనే, పాల్ వాల్తాటి, ఆడమ్ గిల్‌క్రిస్ట్, డేవిడ్ మిల్లర్, వీరేంద్ర సెహ్వాగ్, వృద్దిమాన్ సాహా తలో ఒక సెంచరీ సాధించారు.

ఢిల్లీ, చెన్నై ఎన్నంటే..
ఈ జాబితాలో 10 సెంచరీలతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు మూడో స్థానంలో ఉన్నారు. ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఏడుగురు ఆటగాళ్లు కలిసి ఈ సెంచరీలు సాధించారు. అత్యధిక సెంచరీలు సాధించిన జట్ల జాబితాలో టాప్ 3లో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఒకసారి కూడా టైటిల్ గెలవకపోవడం గమనార్హం. ఇక ఆ తర్వాత 9 సెంచరీలతో చెన్నైసూపర్ కింగ్స్ నాల్గో స్థానంలో ఉంది. ఆ జట్టులోని ఆరుగురు బ్యాటర్లు కలిసి ఈ సెంచరీలు సాధించారు.

రాజస్థాన్, ముంబై ఆటగాళ్లు చేసిన సెంచరీలు
ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు కూడా 9 సెంచరీలు సాధించారు. ఆ జట్టు ఆటగాళ్లు షేన్ వాట్సన్, అజింక్యా రహానే రెండేసి సెంచరీలు చేయగా.. సంజూ శాంసన్, యూసుఫ్ పఠాన్ తలో సెంచరీ సాధించారు. ఇతర బ్యాటర్లు మరో 3 సెంచరీలు సాధించారు.
ఇక 4 సెంచరీలతో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉన్నారు. ఆ జట్టు బ్యాటర్లు సనత్ జయసూర్య, సచిన్ టెండూల్కర్, సిమోన్స్, రోహిత్ శర్మ తలో సెంచరీ సాధించారు.
సన్‌రైజర్స్ ఎన్నంటే..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు 5 సెంచరీలతో ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉన్నారు. ఆ జట్టు ఆటగాళ్లు డేవిడ్ వార్నర్ 4, జానీ బెయిర్ స్టో ఒక సెంచరీ సాధించారు. అయితే ఆ జట్టు డెక్కన చార్జర్స్‌గా ఉన్నప్పుడు 2, సన్‌రైజర్స్ హైదరాబాద్‌గా ఉన్నప్పుడు 3 సెంచరీలు నమోదయ్యాయి. ఇక ఒకే ఒక్క సెంచరీతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ జాబితాలో చిట్ట చివరన ఉంది. ఆ జట్టు బ్యాటర్ బ్రెండన్ మెకెల్లమ్ మొదటి సీజన్లో సెంచరీ సాధించాడు. అలాగే మెక్‌కెల్లమ్ చేసిన సెంచరీనే ఐపీఎల్‌లో మొదటిది అనే విషయం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications