IPL 2022: గుడ్ న్యూస్.. ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కంటిన్యూ! త్వరలోనే అధికారిక ప్రకటన

2021 టీ20 ప్రపంచకప్ జరగుతున్న సమయంలో ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి విరాట్ కోహ్లీ అందరికీ షాకిచ్చాడు. దీంతో విరాట్ కోహ్లీ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అదే సమయంలో టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించాడు. ఆ తర్వాత వన్డే, టెస్ట్ కెప్టెన్సీకి కూడా విరాట్ కోహ్లీ దూరమయ్యాడు.

రాజీనామాను ఆమెదించలేదు
కానీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రాజీనామాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మెనేజ్‌మెంట్ ఇంకా ఆమెదించలేదని సమాచారం. దీంతో బహుషా కోహ్లీనే ఈ సారి కూడా కెప్టెన్‌గా కొనసాగనున్నాడని అభిమానులు భావిస్తున్నారు. నిజానికి విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీ రాజీనామాను వెనక్కి తీసుకోని మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టాలని అభిమానులు కోరుతున్నారు. ఇదే సమయంలో కోహ్లీ రాజీనామాను ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఇంకా ఆమోదించకపోవడం చూసి అభిమానుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నెల 12న కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కొనసాగుతాడని ఆర్సీబీ మేనేజ్‌మెంట్ చెప్పాలని వారు కోరుకుంటున్నారు.

కోహ్లీ కెప్టెన్‌గా ఉండాలని..
కోహ్లీ ఆర్సీబీ, టీమిండియా టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సమయంలో వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌గా కొనసాగాలని భావించాడు. కానీ అలా జరగలేదు. వన్డే, టెస్టు కెప్టెన్సీ కూడా దూరమయ్యాడు. కాగా కోహ్లీ పని భారంతోనే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు అప్పుడే ప్రకటించాడు. కానీ ప్రస్తుతం ఎక్కడా కెప్టెన్‌గా లేకపోవడంతో కోహ్లీకి ఎలాంటి పని భారం లేదు. అందుకే విరాట్ కోహ్లీనే మళ్లీ ఆర్సీబీ కెప్టెన్‌గా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక చూడాలి మరి అభిమానుల ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో! కాగా విరాట్ కోహ్లీ 2013 నుంచి 2021 వరకు ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు.

12న అధికారిక ప్రకటన
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌ను ఈ నెల 12న అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆ జట్టు మేనేజ్‌మెంట్ వెల్లడించింది. ఆ రోజు నూతన కెప్టెన్ పేరుతో, ఆర్సీబీ కొత్త జెర్సీ తదితర వివరాలు ప్రకటించనుంది. కాగా ఆర్సీబీ కెప్టెన్సీ రేసులో దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లిసెస్, ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెయిన్ మాక్స్‌వెల్, భారత ఆటగాడు దినేష్ కార్తీక్ ఉన్నారు.

ఆర్సీబీ పూర్తి జట్టు ఇదే
విరాట్ కోహ్లీ(15 కోట్లు), మ్యాక్స్‌వెల్‌తో(11 కోట్లు), మహమ్మద్ సిరాజ్(7 కోట్లు), వానిందు హసరంగ (10.75 కోట్లు), హర్షల్ పటేల్(10.75 కోట్లు), డుప్లెసిస్ ( 7 కోట్లు), దినేశ్ కార్తీక్(5.5 కోట్లు), జోష్ హేజిల్ వుడ్ (7.75 కోట్లు), షాబాజ్ అహ్మద్(2.4 కోట్లు), అనుజ్ రావత్(3.4 కోట్లు), డేవిడ్ విల్లే ( 2 కోట్లు), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (కోటి) మహిపాల్ లామ్రోర్(95 లక్షలు), ఫిన్ అలెన్ ( 80 లక్షలు), జేసన్ బెహ్‌రెండోర్ఫ్ ( 75 లక్షలు), సిద్ధార్థ్ కౌల్(75 లక్షలు), కర్ణ్ శర్మ(50 లక్షలు), చామ మిలింద్(25 లక్షలు), సుయాశ్ ప్రభుదేశాయ్(30 లక్షలు), ఆకాశ్ దీప్, అనీశ్వర్ గౌతమ్, లువ్‌నిత్ సిసోడియా(వీరందరికీ 20 లక్షలు)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications