
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్రాత్మక రికార్డుకు చేరువలో ఉన్నాడు. టీ20ల్లో మరో 64 పరుగులు చేస్తే ఈ ఫార్మాట్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. తద్వారా టీ20 ఫార్మాట్లో 10 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. మొత్తంగా ఏడో బ్యాటర్‌గా నిలుస్తాడు. దీంతో ఐపీఎల్‌లో నేటి మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ ఈ ఘనతను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు 371 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 9,936 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 3313 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఐపీఎల్‌లో 5652 పరుగులు చేశాడు. ఛాంపియన్స్ లీగ్‌లోను పరుగులు చేశాడు.
ఇక ఈ జాబితాలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. టీ20 ఫార్మాట్లో గేల్ ఇప్పటివరకు 463 మ్యాచ్‌లాడి 14,562 పరుగులు చేశాడు. ఇక రెండో స్థానంలో పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ ఉన్నాడు. 472 మ్యాచ్‌లాడిన మాలిక్ 11,698 పరుగులు చేశాడు. 582 మ్యాచ్‌ల్లో 11,430 పరుగులతో ఈ జాబితాలో వెస్టిండీస్ ఆల్‌రౌండ్ కీరన్ పొలార్డ్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ నాల్గో స్థానంలో ఉన్నాడు. 347 మ్యాచ్‌లాడిన ఫించ్ 10,444 పరుగులు చేశాడు. ఇక 10,326 పరుగులతో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. 328 మ్యాచ్‌ల్లో కోహ్లీ ఈ పరుగులు సాధించాడు. ఆరో స్థానంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వార్నర్ 318 మ్యాచ్‌ల్లో 10,308 పరుగులు చేశాడు.
కాగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ నేడు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ద్వారా హిట్‌మ్యాన్ ఐపీఎల్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తుది జట్లు (అంచనా)
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొల్లార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, టైనల్ మిల్స్, బాసిల్ థంపీ.
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, నాథన్ కౌల్టర్ నీల్ లేదా జిమ్మీ నీషమ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యజువేందర్ చాహల్.