IPL 2022: ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఏకంగా 61 సార్లు

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. శనివారం లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ (6) సింగిల్ డిజిట్‌కే ఔటైయ్యాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్‌కే ఔటైన ఆటగాడిగా రోహిత్ శర్మ చెత్త రికార్డును సాధించాడు. ఈ క్రమంలో దినేష్ కార్తీక్‌ను అధిగమించాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు దినేష్ కార్తీక్ 60 సార్లు సింగిల్ డిజిట్‌కే ఔటవ్వగా.. తాజాగా సింగిల్ డిజిట్‌కే ఔటైన రోహిత్ శర్మ 61 సార్లతో ఆ చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. వీరిద్దరి తర్వాతి స్థానంలో సురేష్ రైనా ఉన్నాడు. సురేష్ రైనా 53 సార్లు సింగిల్ డిజిట్‌కే ఔటయ్యాడు. ఇక 52 సార్లు సింగిల్ డిజిట్‌కే ఔటైనా రాబిన్ ఊతప్ప నాల్గో స్థానంలో, 49 సార్లు సింగిల్ డిజిట్‌కే శిఖర్ ధావన్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు.
ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ ఫేలవ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం 19 సగటుతో 115 పరుగులే చేశాడు. ఒక సారి కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేదు. అత్యధిక స్కోర్ 41 పరుగులుగా ఉంది. ఇందులో 3 సార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఈ సీజన్లో హిట్‌మ్యాన్ వరుసగా 41, 10, 3, 26, 29, 6 పరుగులకే ఔటయ్యాడు.
ఇక శనివారం లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా వరుసగా 6 మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్(103) అజేయ సెంచరీతో చెలరేగాడు. మనీష్ పాండే కూడా 38 పరుగులతో రాణించాడు. అనంతరం 200 పరుగుల లక్ష్య చేధనలో ముంబై 181 పరుగులకే పరిమితమైంది. సూర్యకుమార్ యాదవ్ (37), డెవాల్డ్ బ్రెవిస్ (31), తిలక్ వర్మ(26), కీరన్ పొలార్డు(25) మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 6 పరుగులకే ఔటయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications