
12 లక్షలు ఫైన్
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టో ఓవర్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఫైన్ పడింది. ఇదే తొలి సారి కావడంతో 12 లక్షల రూపాయల ఫైన్ విధిస్తున్నట్లు మ్యాచ్ నిర్వహకులు వెల్లడించారు. దీంతో రోహిత్ శర్మ తొలి మ్యాచ్‌లోనే స్టో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ ఎదుర్కొవలసి వచ్చింది.
ఇదే మొదటి సారే కావడంతో స్లో ఓవర్ రేట్ నియమవాళి ప్రకారం రోహిత్ శర్మకు 12 లక్షల రూపాయల ఫైన్ విధిస్తున్నట్లు ఐపీఎల్ పాలకమండలి ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో రోహిత్ శర్మ పరిస్థితిని చూసి పాపం కష్టాలన్నీ రోహిత్ శర్మకే వస్తున్నాయని, ఒక్కసారి కూడా ఫస్ట్ మ్యాచ్‌లో గెలవలేదని, మ్యాచ్ పాయే 12 లక్షలు రూపాయలు పాయే అని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు.

ఒక్క సారి కూడా గెలవలే
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో ఒక్క సారి కూడా ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించకపోవడం గమనార్హం. దీంతో ఐపీఎల్‌లో ఒక్క సారి కూడా ఆరంభ మ్యాచ్‌లో గెలవని కెప్టెన్‌గా రోహిత్ శర్మ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 2014 నుంచి తన కెప్టెన్సీలో ముంబైకి హిట్‌మ్యాన్ ఒక్క విజయం కూడా అందించలేకపోయాడు. అంటే 9 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ ఆరంభ మ్యాచ్‌లో ఓడిపోయాడు. ఇక ముంబై ఇండియన్స్ అయితే 2013 నుంచి ఇప్పటివరకు అంటే వరుసగా 10 ఆరంభ మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. అయితే హిట్ మ్యాన్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్‌ల్లో విజయం సాధించినప్పటికీ రికార్డు స్థాయిలో 5 సార్లు ఐపీఎల్ ట్రోఫి అందుకోవడం విశేషం.

ముంబై ఓటమి
ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 81 పరుగులతో చెలరేగగా.. రోహిత్ శర్మ 41 పరుగులతో రాణించాడు. అనంతరం 178 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే చేధించి 4 వికెట్ల తేడాతో గెలిచింది. లలిత్ యాదవ్ (48*), అక్షర్ పటేల్ (38*) చివరి వరకు ఆడి ఢిల్లీని గెలపించారు. 3 కీలక వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.


Click it and Unblock the Notifications













