
కీరన్ పొలార్డ్ తర్వాత..
ఈ సిక్స్‌తో రోహిత్ ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీ కోసం అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ల లిస్టులో చేరాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున క్రిస్ గేల్ 263సిక్సర్లతో అత్యధికంగా ఓ ఫ్రాంఛైజీ తరఫున సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. పొలార్డ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఏబీ డివిలియర్స్ (240 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (228 సిక్సర్లు) ఈ జాబితాలో మూడు, నాలుగో స్థానంలో ఉన్నారు. గేల్, కోహ్లీ, డివిలియర్స్ ముగ్గురు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫునే ఈ ఫీట్ అందుకోవడం గమనార్హం. 5వ స్థానంలో రోహిత్ శర్మ (200సిక్సర్లు) ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు సురేశ్ రైనా (220 సిక్సర్లు), ఎంఎస్ ధోనీ (218 సిక్సర్లు) కూడా ఐపీఎల్‌లోని 200 సిక్సర్లు బాదిన లిస్టులో ఉన్నారు.. కానీ వారు చెన్నైతో పాటు వేరే జట్టుతో కలిపి ఈ సిక్సర్లు సాధించారు.

ఐపీఎల్లో ఒక జట్టు తరఫున 200 ప్లస్ సిక్సర్లు బాదిన ఆటగాళ్లు
1. ఆర్సీబీ తరఫున క్రిస్ గేల్
2. ఆర్సీబీ తరఫున డివిలియర్స్
3. ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ
4. ముంబై తరఫున కీరన్ పొలార్డ్
5. ముంబై తరఫున రోహిత్ శర్మ

అత్యధిక పరుగుల జాబితాలోనూ..
ఎనిమిదో ఓవర్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్లో ఎల్‌బిడబ్ల్యుగా రోహిత్ ఔటయ్యాడు. రోహిత్ ఈ సీజన్‌లో తొలి యాభైకి చేరువలో ఉన్న టైంలో అవుటయ్యాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి 74పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రోహిత్ 28బంతుల్లో 43పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో డేవిడ్ వార్నర్(5804)ను కూడా రోహిత్ అధిగమించాడు. కోహ్లి 6499పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, శిఖర్ ధావన్ (6153 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ (5809పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు.

ఆలస్యంగా టచ్‌లోకి వచ్చాం
వరుసగా ఎనిమిది ఓటములను నమోదు చేసి ఇప్పటికే టోర్నమెంట్ ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. వరుసగా రెండో మ్యాచ్ గెలవడం సంతోషాన్నిచ్చిందన్నాడు. మేము చాలా ఆలస్యంగా టచ్‌లోకి వచ్చామని, ప్రస్తుతం ఊపందుకుంటున్నామని తెలిపాడు. మైదానంలోకి వచ్చిన ప్రతిసారీ మనల్ని మనం నిరూపించుకోవాలని, ఈ రోజు లాంటి ప్రదర్శనను నిలకడగా కొనసాగించాలని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications
