For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: కెప్టెన్ వ‌చ్చేశాడు.. ఇక మొద‌లెట్టంటి! ముంబై ఇండియ‌న్స్‌తో క‌లిసిన రోహిత్, బుమ్రా

IPL 2022: Rohit Sharma and Jasprit Bumrah join Mumbai Indians after victory in Pink Ball Test

ముంబై: బెంగ‌ళూరు వేదిక‌గా శ్రీల‌కంతో జ‌రిగిన పింక్‌బాల్ టెస్టు మ్యాచ్‌లో ఘ‌న విజ‌యం అనంత‌రం టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ నేరుగా ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుతో క‌లిశాడు.కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ‌తోపాటు పేస్ గ‌న్ జ‌స్ప్రీత్ బుమ్రా కూడా ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుతో క‌లిశాడు. టెస్ట్ మ్యాచ్ 3 రోజుల్లోనే ముగియంతో వీరిద్ద‌రు అక్క‌డి నుంచి నేరుగా ముంబై చేరుకుని టీం బ‌స చేస్తున్న హోట‌ల్ గ‌దికి చేరుకున్నారు. మ్యాచ్ ముగిసిన గంట‌ల స‌మ‌యంలోనే వీరు టీంతో క‌ల‌వ‌డం గ‌మ‌నార్హం. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియ‌న్స్ ఫ్రాంచైజీ అన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ముంబై ఇండియ‌న్స్ పోస్ట్ చేసిన వీడియోలో రోహిత్ శ‌ర్మ త‌న కూతురు సమైరా, భార్య రితికా సజ్దేహ్‌తో రావ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. వీడియోలో హిట్‌మ్యాన్ కూతురిని ఎత్తుకుని క‌నిపించాడు. అలాగే ముంబై ఇండియ‌న్స్ ఇప్ప‌టివ‌ర‌కు గెలిచిన 5 ట్రోఫీలను హోటళ్లో సంద‌ర్శ‌న‌కు ఉంచ‌గా.. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూతురితో క‌లిసి వాటిని వీక్షించ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఐపీఎల్ 2022కు మ‌రో 10 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ఇప్ప‌టికే ప్రాక్టీసు మొద‌లుపెట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు టోర్నీలో అత్య‌ధికంగా 5 సార్లు ఛాంపియ‌న్‌గా నిలిచిన ముంబై ఇండియ‌న్స్ ఈ సీజ‌న్‌లో ఆరో క‌ప్ గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. నిబంధ‌న‌ల ప్ర‌కారం శ్రీ‌లంక‌తో సిరీస్ ఆడిన ఆట‌గాళ్లు ఎలాంటి క్వారంటైన్ లేకుండా నేరుగా జ‌ట్టుతో క‌ల‌వ‌చ్చు. ఇత‌ర ఆట‌గాళ్లు మాత్రం 3 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. కాగా ముంబై ఇండియ‌న్స్ త‌న తొలి మ్య‌చ్‌లో ఈ నెల 27న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

ముంబై ఇండియ‌న్స్ పూర్తి స్క్వాడ్
రోహిత్ శర్మ (16 కోట్లు), జ‌స్ప్రీత్‌ బుమ్రా (12 కోట్లు), కీరన్‌ పొలార్డ్ (6 కోట్లు), సూర్యకుమార్ యాద‌వ్ (8 కోట్లు), ఇషాన్‌ కిషన్ (15.25 కోట్లు), టిమ్‌ డేవిడ్ (ఓవర్సీస్ - రూ. 8.25 కోట్లు), జొఫ్రా ఆర్చర్ (ఓవర్సీస్ రూ. 8 కోట్లు), డేవిడ్ బ్రెవిస్‌ (ఓవర్సీస్‌-3 కోట్లు), డేనియల్‌ సామ్స్‌ (ఓవర్సీస్ -రూ. 2.60 కోట్లు), తిలక్‌ వర్మ(1.70 కోట్లు), మురుగన్‌ అశ్విన్ (1.60 కోట్లు), టైమల్‌ మిల్స్‌ (ఓవర్సీస్‌-1.50 కోట్లు), జయ్‌దేవ్‌ ఉనద్కత్ (1.30 కోట్లు), రిలే మెరెడిత్ (ఓవర్సీస్ కోటి), ఫాబియన్‌ అలెన్ (ఓవర్సీస్ 75 లక్షలు), మయాంక్‌ మార్కండే ( 65 లక్షలు), సంజయ్‌ యాదవ్ (50 లక్షలు), బసిల్ థంపి (30 లక్షలు), అర్జున్ తెందూల్కర్ (30 లక్షలు), ఆర్యన్ జుయల్‌, హృతిక్‌ షోకీన్‌, మహమ్మద్‌ అర్షద్‌ ఖాన్‌, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌, రాహుల్‌ బుద్ది, రమణ్‌ దీప్‌ సింగ్ ( వీరంద‌రికీ 20 లక్షలు)

Story first published: Tuesday, March 15, 2022, 14:26 [IST]
Other articles published on Mar 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+