Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాయల్ ఛాలెంజర్స్‌ ప్లేఆఫ్స్‌కు వెళ్లలేదు: బాంబు పేల్చిన వెస్టిండీస్ లెజెండ్

IPL 2022: RCB Wont Qualify For Playoffs Says Ian Bishop For These Reasons

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా సాధించిన రెండో ఓటమి.. ఆ జట్టును తీవ్ర విమర్శలపాలు చేస్తోంది. క్రమంగా ఈ జట్టు కూడా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరహాలో తయారవుతోందనే ఆందోళనలు అభిమానుల నుంచి వ్యక్తమౌతున్నాయి. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లల్లో అయిదింట్లో గెలిచినా.. పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో నిలిచానా ఆ తృప్తి అనేది మిగలట్లేదు.

వరుస ఓటములకు చాలా కారణాలు..

వరుస ఓటములకు చాలా కారణాలు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస ఓటములకు చాలా కారణాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలు జట్టును వేధిస్తోన్నాయి. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలడం అభిమానులకు మింగుడు పడనివ్వట్లేదు. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది ఆర్సీబీ.

కనీసం ఆ లక్ష్యాన్ని అందుకునే ప్రయత్నం కూడా చేయలేదు. 115 పరుగులకే కుప్పకూలిందంటే బ్యాటింగ్ ఆర్డర్ ఎంత అస్తవ్యస్తంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు.

రెండు మ్యాచ్‌లల్లో ఘోర వైఫల్యం..

రెండు మ్యాచ్‌లల్లో ఘోర వైఫల్యం..

అంతకుముందు మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతిలో ఓడింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ చేసిన స్కోర్ 68 పరుగులు మాత్రమే. పూర్తి 20 ఓవర్లను కూడా ఆడలేక చేతులెత్తేసింది. 16.1 ఓవర్లకు చాప చుట్టేసింది. ఇప్పుడు తాజాగా రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోలేక 115 పరుగులకే ఆలౌట్ అయింది.

జట్టు బ్యాటింగ్ వైఫల్యానికి ఈ రెండు మ్యాచ్‌లు అద్దం పట్టాయి. ప్రమాద ఘంటికలను మోగించాయి. మేల్కొనకపోతే ముప్పు తప్పదనే సంకేతాలను పంపించాయి.

ప్లేఆఫ్స్ కష్టమే..

ప్లేఆఫ్స్ కష్టమే..

చెత్తగా ఓడిన ఈ రెండు మ్యాచ్‌ల అనంతరం రాయల్ ఛాలెంజర్స్ ఇక పుంజుకోకపోవచ్చని, తనను తాను మళ్లీ మార్చుకోవాల్సిన అవసరం ఉందని వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్, కామెంటేటర్ ఇయాన్ బిషప్ స్పష్టం చేశాడు. ఇలాంటి నాసిరకం ఆటతీరుతో ఈ టోర్నమెంట్‌లో చివరి వరకూ కొనసాగడం కష్టమని, ఇలాగే ఆడితే- రాయల్ ఛాలెంజర్స్ ప్లేఆఫ్స్‌కు చేరబోదనీ జోస్యం చెప్పాడు. మళ్లీ పుంజుకోవాలంటే కఠోరంగా శ్రమించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు.

145 పరుగులను ఛేదించలేకపోతే ఎలా..

145 పరుగులను ఛేదించలేకపోతే ఎలా..

రాజస్థాన్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోవడం తనను ఆందోళన కలిగిస్తోందని ఇయాన్ బిషప్ చెప్పాడు. మిడిలార్డర్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ విఫలమైతే ఇన్నింగ్‌ను నిలబెట్టేలా బ్యాటర్లు లేరా? అని ప్రశ్నించాడు.

విరాట్ కోహ్లీ మళ్లీ గాడిన పడాల్సిన అవసరం ఉందని, అతను పరుగులు చేస్తేనే జట్టు నిలబడగలుగుతుందని తేల్చిచెప్పాడు. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ ఎదుర్కొనే ఒత్తిడిని తామూ తీసుకోవాల్సిన బాధ్యతను ఫాఫ్ డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ తీసుకోవాలని సూచించాడు.

Story first published: Wednesday, April 27, 2022, 12:54 [IST]
Other articles published on Apr 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+