For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దటీజ్..దినేష్ కార్తీక్: బౌలర్లకు కొరుకుడుపడని డీకే: హ్యాట్రిక్ నాటౌట్: అక్కరకొచ్చిన ఆ అనుభవం

IPL 2022, RCB vs RR: Dinesh Karthik won the player of the match for his incredible inning

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా మరో రసవత్తరమైన మ్యాచ్ ముగిసింది. ముంబై వాంఖెడె స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ చిత్తయింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లల్లోనూ తిరుగులేని విజయాలను నమోదు చేసిన ఆ జట్టుకు పరాజయాన్ని పరిచయం చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. నాలుగు వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఫాఫ్ టీమ్.. తన పాయింట్లను మెరుగుపర్చుకుంది.

మూడు వికెట్లకే..

మూడు వికెట్లకే..

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో 169 పరుగులను చేసింది. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది. జోస్ బట్లర్ మరోసారి చెలరేగిపోయాడు. 47 బంతుల్లో ఆరు సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. దేవ్‌దత్ పడిక్కల్-37 పరుగులు చేశాడు. చివర్లో షిమ్రోన్ హెట్మెయిర్ విజృంభణ తోడు కావడంతో రాజస్థాన్ భారీ స్కోర్ సాధించింది. తన ప్రత్యర్థికి 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.

 దినేష్ కార్తీక్-షాబాజ్ అహ్మద్ మెరుపులు

దినేష్ కార్తీక్-షాబాజ్ అహ్మద్ మెరుపులు

రాయల్ ఛాలెంజర్స్ 19.1 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 173 పరుగులు చేసింది. ఓటమి తప్పదనుకున్న దశలో ఆర్సీబీ అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అయింది. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్-షాబాజ్ అహ్మద్ పోటీ పడి పరుగులు సాధించారు. రాజస్థాన్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఆరవ వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. షాబాజ్ అవుట్ అయినా- అప్పటికే గెలుపు ఖాయం కావడంతో బెంగళూరు బెంగ తీరిపోయింది.

దంచి కొట్టిన దినేష్ కార్తిక్

దంచి కొట్టిన దినేష్ కార్తిక్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దినేష్ కార్తిక్.. అద్భుతంగా ఆడాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. షాబాజ్ అహ్మద్‌తో కలిసి మరో వికెట్ పడకుండా, ఇన్నింగ్ వేగం తగ్గకుండా కోఆర్డినేట్ చేసుకుంటూ డీకే ఆడిన తీరు అతని సత్తాకు అద్దం పట్టింది. దూకుడు మీదున్న షాబాజ్ అహ్మద్‌ను ఆడటానికీ అవకాశం ఇచ్చాడు. స్ట్రైక్‌ను రొటేట్ చేశాడు. ఇదివరకు కోల్‌కత నైట్ రైడర్స్‌కు కేప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఇక్కడ అతనికి కలిసొచ్చింది.

 మూడు మ్యాచ్‌లల్లో నాటౌట్

మూడు మ్యాచ్‌లల్లో నాటౌట్

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లల్లోనూ దినేష్ కార్తిక్ నాటౌట్‌గా నిలిచాడు. గ్రేట్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 90 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్‌పై ఆడిన తొలి మ్యాచ్‌లో 14 బంతుల్లోనే 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రెండో మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌పై 7 బంతుల్లో 14 పరుగులు సాధించాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌పై మరింత విజ‌ృంభించాడు. 23 బంతుల్లోనే 44 పరుగులు చేసి.. మరోసారి నాటౌట్‌గా ఉన్నాడు.

ఒత్తిడి సమయంలో క్రీజ్‌లోకి..

ఒత్తిడి సమయంలో క్రీజ్‌లోకి..

ఇదివరకు కోల్‌కత నైట్ రైడర్స్‌కు కేప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం దినేష్ కార్తిక్‌కు ఈ మ్యాచ్‌లో కలిసొచ్చింది. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాడు. 87 పరుగులకు అయిదు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్‌లోకి వచ్చిన అతను షాబాజ్ అహ్మద్‌తో కలిసి ఇన్నింగ్‌ను పునర్నిర్మించాడు. ఎంత వేగంగా తన జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిందో.. అంతే వేగంతో దాన్ని గాడిన పెట్టాడు. ఒత్తిళ్ల మధ్య.. వికెట్ పడకుండా.. భారీ షాట్లను ఆడటం అంటే మాటలు కాదు. అలాంటి గడ్డు పరిస్థితిని అధిరోహించగలిగాడు.

Story first published: Wednesday, April 6, 2022, 8:16 [IST]
Other articles published on Apr 6, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+