
వికెట్ పడకుండా..రన్‌రేట్ తగ్గకుండా
ప్రత్యేకించి.. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్-షాబాజ్ అహ్మద్ ద్వయం సంజు శాంసన్ టీమ్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. 87 పరుగులకు సగం వికెట్లను కోల్పోయి- ఓటమి అంచుల్లో ఉన్న దశలో రాయల్ ఛాలెంజర్స్.. రాయల్‌గా రాణించింది. ఆ జట్టు నిలదొక్కుకుని- విజయం వైపు సాగించిన ప్రయాణం ఓ అద్భుతమే. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు దినేష్ కార్తీక్-షాబాజ్ అహ్మద్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడటం మాత్రమే కాకుండా- రన్‌రేట్‌ను పరుగులు పెట్టించారు. జట్టు విజయం సాధించడానికి అవసరమైన రన్‌రేట్ ఎక్కడా తగ్గకుండా చూసుకున్నారు.

మలుపు తిప్పిన 14వ ఓవర్..
స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేసిన 14వ ఓవర్.. రాజస్థాన్ రాయల్స్‌కు మ్యాచ్‌ను దూరం చేసింది. ఆ ఓవర్‌లో మొత్తంగా 21 పరుగులను పిండుకున్నారు బ్యాటర్లు. మూడో బంతిని ఫైన్ లెగ్ దిశగా బౌండరీకి తరలించాడు. అది నో బాల్ కావడంతో వల్ల లభించిన ఫ్రీ హిట్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. దాన్ని సిక్సర్‌గా మలిచాడు. ఆ వెంటనే మరో మరో రెండు బౌండరీలు బాదాడు. ఫలితంగా ఆ ఓవర్‌లో 21 పరుగులు లభించాయి. మ్యాచ్ మొత్తం రాయల్ ఛాలెంజర్స్ వైపు మొగ్గింది.
ఐపీఎల్‌లో వందో విక్టరీ..
ఆ తరువాత కూడా అదే దూకుడును కొనసాగించారు. ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో భారీగా పరుగులు రాబట్టుకున్నారు. ఫలితంగా ఇంకో అయిదు బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ ఓ రికార్డును నెలకొల్పడం విశేషం. ఇది ఐపీఎల్ సీజన్లల్లో 100వ విజయం. రాజస్థాన్ రాయల్స్‌పైనా ఓ అరుదైన రికార్డును నెలకొల్పుకుంది. ఈ పింక్ టీమ్‌పై వరుసగా అయిదు మ్యాచ్‌లను గెలిచింది ఆర్సీబీ. ఈ రెండు జట్లు తలపడిన చివరి అయిదు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ పైచేయి సాధించింది.
డ్రెస్సింగ్ రూమ్‌లో సెలబ్రేషన్స్..
విజయాన్ని రాయల్ ఛాలెంజర్స్ జట్టు మేనేజ్‌మెంట్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. డ్రెస్సింగ్ రూమ్ మొత్తం ఆనందోత్సాహాలతో నిండిపోయింది. వెరైటీ ఫుడ్ ఐటమ్స్‌తో ఎంజాయ్ చేశారు. ఆర్సీబీ.. ఆర్సీబీ అనే నినాదాలతో డ్రెస్సింగ్ రూమ్ మారుమోగిపోయింది. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ ఆర్సీబియన్ అంటూ నినదించారు. వందో విక్టరీ కావడం వల్ల వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. కొత్త పెళ్లికొడుకు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా జట్టుతో చేరడం వారి విజయోత్సవాన్ని మరింత సందడిగా మార్చింది.


Click it and Unblock the Notifications
