ఫాఫ్ సెంచరీ మిస్..
తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్- నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 96 పరుగులు చేశాడు. సెంచరీని చేజార్చుకున్నాడు. విరాట్ కోహ్లీది గోల్డెన్ డక్. ఎదుర్కొన్న తొలి బంతికి పెవిలియన్ దారి పట్టాడు. మిడిలార్డర్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ తప్ప మరెవరూ భారీ స్కోర్ చేయలేకపోయారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో దుష్మంత్ చమీరా, జేసన్ హోల్డర్ రెండేసి వికెట్లు కూల్చారు. కృనాల్ పాండ్యా ఓ వికెట్ పడగొట్టాడు.
బ్యాటింగ్ పేలవం..
ఛేజింగ్‌కు దిగిన లక్నో జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. కేఎల్ రాహుల్-30, కృనాల్ పాండ్యా-42 మాత్రమే రాణించారు. క్వింటన్ డికాక్, మనీష్ పాండే, దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టొయినిస్ తమ స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయారు. జోష్ హేజిల్‌వుడ్ లక్నో బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. నాలుగు ఓవర్లల్లో 25 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
స్టొయినిస్ అసహనం..
టాప్‌గేర్‌లోకి వచ్చిన తరువాత మార్కస్ స్టొయినిస్ అవుట్ కావడం.. అతనిలోని అసహనానికి అద్దం పట్టింది. చివరి 12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుట్ అయ్యాడు. 19వ ఓవర్‌ను జోష్ హేజిల్‌వుడ్ సంధించాడు. తొలి బంతిని అంపైర్ వైడ్‌గా ఇవ్వకపోవడంతో స్టొయినిస్ అసహనానికి గురయ్యాడు. అంపైర్‌ను ఉద్దేశించి ఏవో సైగలు సైతం చేశాడు. రెండో బంతిని కూడా హేజిల్‌వుడ్ వైడ్‌గా సంధిస్తాడనే ఉద్దేశంతో స్టంప్స్‌ను వదిలి కుడివైపునకు వచ్చి బంతిని ఆడబోయాడు.
బూతుపదంతో
దీన్ని ముందే పసిగట్టిన హేజిల్‌వుడ్ నేరుగా స్టంప్స్ మీదికి బంతిని సంధించాడు. అవి కాస్తా వికెట్లను గిరాటేశాయి. తొలి బంతికి అంపైర్ అవుట్ ఇవ్వకపోవడం.. రెండో బంతి- తాను అనుకున్న విధంగా పిచ్ కాకపోవడంతో స్టొయినిస్ ఆగ్రహంతో ఊగిపోయాడు. F*** you అంటూ గట్టిగా అరిచాడు. అది వినడానికి వికెట్లకు అమర్చిన మైక్స్ కూడా అవసరం లేకుండా పోయింది. అదే ఆవేశంతో పెవిలియన్ దారి పట్టాడు. వెళ్లే సమయంలో తనకు ఎదురుగా వచ్చిన ఓ రాయల్ ఛాలెంజర్స్ ఫీల్డర్‌పై బ్యాట్ ఎత్తడం కనిపించింది. ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన జేసన్ హోల్డర్.. చివరి ఓవర్‌లో రెండు బ్యాక్ అండ్ బ్యాక్ సిక్సర్లు బాదాడు గానీ అప్పటికే ఓటమి ఖరారైంది. ఈ సిక్సర్లు ఓటమి ఆంతర్యాన్ని తగ్గించగలిగాయంతే.


Click it and Unblock the Notifications
