Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రెయిన్ ఫ్రై: కోహ్లీకి రవిశాస్త్రి బిగ్ అడ్వైజ్: పీటర్సన్ వత్తాసు: వాళ్లు అలా..ఫ్యాన్స్ ఇలా

IPL 2022, RCB vs LSG: Ravi Shastri big advice to Virat Kohli after golden duck, here is the details

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం నాటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. 18 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఏడు మ్యాచ్‌లల్లో అయిదింట్లో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. రాయల్ ఛాలెంజర్స్‌కు ఇది వరుసగా రెండో విజయం. ఇక తన తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీ కొట్టనుంది. శనివారం సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ ఉంటుంది.

విరాట్ కోహ్లీ బాధాకరంగా..

విరాట్ కోహ్లీ బాధాకరంగా..

ఈ మ్యాచ్‌‌లో కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఒక్కడే ఆడాడు. జట్టు బ్యాటింగ్ భారాన్ని పూర్తిగా మోశాడు. జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు 182 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగిందంటే అది డుప్లెసిస్ చలవే. మిడిల్ ఆర్డర్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్ కేప్టెన్‌కు అండగా నిలిచారు. మ్యాక్స్‌వెల్-23, షాబాజ్ అహ్మద్-26 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగడం.. హైలైట్‌.

తొలి బంతికే..

తొలి బంతికే..

తాను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియర్ దారి పట్టాడీ వరల్డ్ క్లాస్ బ్యాటర్. రెండో ఓవర్‌‌ను సంధించిన దుష్మంత చమీర బ్యాక్ అండ్ బ్యాక్ రెండు వికెట్లు నేలకూల్చాడు. అయిదో బంతికి అనూజ్ రావత్ అవుట్ అయ్యాడు. ఆరో బంతిని విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. అతను సంధించిన బంతిని షాట్ ఆడబోయిన కోహ్లీ.. టైమింగ్ మిస్ అయ్యాడు. ఆ బంతి కాస్తా బ్యాక్ వర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న దీపక్ హుడా చేతుల్లో వాలింది. అప్పటికి జట్టు స్కోరు ఏడు పరుగులే.

అచ్చిరాని సీజన్..

అచ్చిరాని సీజన్..

ఈ సీజన్‌.. విరాట్ కోహ్లీకి పెద్దగా అచ్చిరానట్టే కనిపిస్తోంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లల్లో అతను చేసింది 119 పరుగులే. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ముంబై ఇండియన్స్‌పై చేసిన 48 పరుగులే ఈ సీజన్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్. బ్యాటింగ్ యావరేజ్ 19.96. ఈ ఏడు మ్యాచ్‌లల్లో కింగ్ కోహ్లీ బ్యాట్ నుంచి జాలువారింది తొమ్మిది ఫోర్లు మాత్రమే. రెండంటే రెండు సిక్సులే కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా టీ20 ఫార్మట్‌కు తగ్గట్టుగా లేదు. 123.96 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు.

గోల్డెన్ డక్‌తో ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్..

గోల్డెన్ డక్‌తో ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్..

ఈ పరిణామాలు విరాట్ కోహ్లీ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి- లక్నో సూపర్ జెయింట్స్‌పై గోల్డెన్ డకౌట్ కావడాన్ని భరించలేకపోతున్నారు. హార్ట్ బ్రేక్ ఎమోజీలతో సోషల్ మీడియాలో వందలాది పోస్టులు పెడుతున్నారు. విరాట్ కోహ్లీ పేరు ట్రెండింగ్‌లో ఉంటోంది. ఒక్క భారీ ఇన్నింగ్ అయినా ఆడాలంటూ అభిమానులు కోహ్లీని కోరుకుంటోన్నారు. ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయిన తరువాత కోహ్లీ బాధతో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్.. అతని అభిమానులను మరింత కలచి వేస్తోంది.

 విశ్రాంతి తీసుకో..

విశ్రాంతి తీసుకో..

భారీ ఇన్నింగ్ ఆడాలంటూ అభిమానులు కోరుకుంటోన్న వేళ..భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి ఓ కీలక సలహా ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విరాట్ కోహ్లీకి విశ్రాంతి అవసరం అని, కొంతకాలం పాటు క్రికెట్ నుంచి విరామాన్ని ప్రకటించాలని సూచించాడు. సుదీర్ఘమైన క్రికెట్ ఆడగలిగే శక్తి సామర్థ్యాలు కోహ్లీకి ఉన్నాయని, దీన్ని కాపాడుకోవాలంటే కొంతకాలం విశ్రాంతి తీసుకోక తప్పదనీ చెప్పాడు.

బయోబబుల్‌లో సుదీర్ఘ క్రికెట్..

బయోబబుల్‌లో సుదీర్ఘ క్రికెట్..

తన అంచనా ప్రకారం.. మరో అయిదారేళ్ల పాటు క్రికెట్ ఆడగలిగే సామర్థ్యం కోహ్లీకి ఉందని రవిశాస్త్రి చెప్పాడు. విరామం లేకుండా క్రికెట్ ఆడటం వల్ల అతని బ్రెయిన్ ఫ్రై అయిపోయినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. కనీసం ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకుని.. మళ్లీ రీఫ్రెష్‌తో రీఎంట్రి ఇవ్వాలని చెప్పాడు. బయో బబుల్ వాతావరణంలో విరామం లేని క్రికెట్ ఆడుతూ వస్తున్నాడని, ఇలాంటివి ప్రతి ఒక్కరికీ తప్పకపోవచ్చని అన్నాడు. ఇదివరకు కొందరు క్రికెటర్లు విరామం తీసుకున్నారని గుర్తు చేశాడు.

 వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించాలంటూ..

వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించాలంటూ..

రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను ఇంగ్లాండ్ లెజెండరీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సమర్థించాడు. విరాట్ కోహ్లీ విషయంలో రవిశాస్త్రి ఇచ్చిన స్టేట్‌మెంట్ వందశాతం కరెక్టేనని చెప్పాడు. ఆరునెలల పాటు అతను క్రికెట్‌కు దూరంగా ఉండాలని సూచించాడు. సోషల్ మీడియాను సైతం టర్న్ ఆఫ్ చేసి, భార్యాపిల్లలతో సంతోషంగా గడపాలని చెప్పాడు. భర్తగా, తండ్రిగా, అతనికి వ్యక్తిగత జీవితం ఉందని, కొంతకాలం పాటు దాన్ని ఆస్వాదించాలని కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, April 20, 2022, 10:38 [IST]
Other articles published on Apr 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+