For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs KKR Dream 11, Playing 11: తుది జట్టు ఆ రేంజ్‌లో ఉంటే తప్ప..!

IPL 2022: RCB vs KKR Top Picks For Dream11 Prediction and Playing 11 are here

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022, 15వ ఎడిషన్‌లో భాగంగా ఈ సాయంత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ బరిలోకి దిగబోతున్నాయి. ఈ మ్యాచ్‌తో రెండో రౌండ్ ఆరంభం కానుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఈ రెండు జట్లు ఇప్పటికే తలా ఓ మ్యాచ్ ఆడేశాయి. నైట్ రైడర్స్ ఖాతాలో ఓ విజయం నమోదైంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోందీ జట్టు. ఈ సాయంత్రం తన తదుపరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌తో తలపడుతుంది.

 కోల్‌కత ఖాతాలో..

కోల్‌కత ఖాతాలో..

ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించింది కోల్‌కత. సూపర్‌గా బోణీ కొట్టింది. రవీంద్ర జడేజా జట్టును 131 పరుగులకే కట్టడి చేసింది. కాస్త తడబడుతూనే అయినప్పటికీ- ఆ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్‌లో బౌలర్లు సమష్టిగా రాణించారు. బ్యాటర్లు ఫర్వాలేదనిపించుకున్నారంతే. టార్గెట్ చిన్నదే అయినా దాన్ని చేరడానికి కోల్‌కత ఆపసోపాలు పడింది. చివరి ఓవర్ వరకూ శ్రమించాల్సి వచ్చింది. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ను ఎదుర్కొనబోతోంది.

ఆల్‌రౌండర్లతో..

ఆల్‌రౌండర్లతో..

వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, సామ్ బిల్లింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్ల, ఆల్ రౌండర్లతో నిండివుండి నైట్ రైడర్స్. బౌలింగ్ విభాగం కూడా తక్కువేమీ కాదు. ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌, శివం మావి.. బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేసేవారే. వెంకటేష్ అయ్యర్ సైతం బౌలింగ్ చేయగలగడు. ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ బంతి, బ్యాట్‌తో రాణించగలరు.

పరాజయంతో..

పరాజయంతో..

బెంగళూరు మాత్రం పరాజయంతో ఈ సిరీస్‌ను ఆరంభించింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. 205 పరుగుల భారీ స్కోర్ సాధించినప్పటికీ.. దాన్ని కాపాడుకోలేకపోయింది. రాయల్ ఛాలెంజర్స్ ఖాతాలో ఇదో దిగ్భ్రాంతికర పరాజయంగా చెప్పుకోవచ్చు. ఈ సాయంత్రం నైట్ రైడర్స్‌పై విజయం సాధించడం ద్వారా ఐపీఎల్‌లో బోణీ కొట్టాలని కృతనిశ్చయంతో కనిపిస్తోందీ ఫాఫ్ టీమ్. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే.. దాని దుష్ప్రభావం జట్టు ఆటగాళ్లపై పడుతుంది.

బ్యాటింగ్ బౌలింగ్‌లో బలంగా..

బ్యాటింగ్ బౌలింగ్‌లో బలంగా..

బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్‌లో కోల్‌కతకు ఏ మాత్రం తీసిపోదు. ఫాఫ్ డుప్లెసిస్.. తన సత్తా ఏమిటో తొలి మ్యాచ్‌లోనే నిరూపించుకున్నాడు. 88 పరుగులు చేశాడు. కింగ్ కోహ్లీ, దినేష్ కార్తీక్, షెర్ఫానె రూథర్‌ఫర్డ్, షాబాజ్ అహ్మద్‌కు.. బ్యాటింగ్‌లో రాణించే సత్తా ఉంది. వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ వంటి బౌలర్లు జట్టులో ఉన్నారు. పంజాబ్ కింగ్స్‌తో ఆడిన జట్టుతోనే రాయల్ ఛాలెంజర్స్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది.

తుదిజట్టులో..

తుదిజట్టులో..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టులో- ఫాఫ్ డుప్లెసిస్ (కేప్టెన్), విరాట్ కోహ్లీ, అనూజ్ రావత్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షెర్ఫానె రూథర్‌ఫర్డ్, షాబాజ్ అహ్మద్‌, వనిందు హసరంగ, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, అక్ష్ దీప్, మహ్మద్ సిరాజ్ చోటు దక్కించుకోవచ్చు. కేకేఆర్‌ తరఫున- వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్ (కేప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్ (వికెట్ కీపర్), ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి ఆడే అవకాశం ఉంది.

డ్రీమ్ 11లో-

డ్రీమ్ 11లో-

డ్రీమ టీమ్ 1: ఫాఫ్ డుప్లెసిస్ (వైస్ కేప్టెన్), అజింక్య రహానె, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (కేప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, వనిందు హసరంగ, డేవిడ్ విల్లే, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. డ్రీమ్ టీమ్ 2: ఫాఫ్ డుప్లెసిస్ (కేప్టెన్), వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానె (వైస్ కేప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, షెల్డన్ జాక్సన్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, హర్షల్ పటేల్, ఉమేష్ యాదవ్, అక్ష్ దీప్, వరుణ్ చక్రవర్తి.

Story first published: Wednesday, March 30, 2022, 13:08 [IST]
Other articles published on Mar 30, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+