Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నైట్‌రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బిగ్ ఫైట్: రెండు రికార్డులకు అడుగు దూరంలో కోహ్లీ

 IPL 2022, RCB vs KKR: Kohli needs 3 more sixes to overtake Kieron Pollard as 214 sixes

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవ్వాళ్టి రెండో రౌండ్ ఆరంభం కానుంది. ఇందులో భాగంగా మరో హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ తలపడనున్నాయి. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ రెండు జట్లు ఇప్పటికే తలా ఓ మ్యాచ్ ఆడేశాయి. కోల్‌కత నైట్ రైడర్స్ ఖాతాలో ఓ ఘన విజయం ఉంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోందీ జట్టు. తన తదుపరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌తో తలపడుతుంది.

బెంగళూరు పరిస్థితి దీనికి భిన్నం. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. 205 పరుగుల భారీ స్కోర్ సాధించినప్పటికీ.. దాన్ని కాపాడుకోలేకపోయింది. రాయల్ ఛాలెంజర్స్ ఖాతాలో ఇదో దిగ్భ్రాంతికర పరాజయంగా చెప్పుకోవచ్చు. ఈ సాయంత్రం నైట్ రైడర్స్‌పై విజయం సాధించడం ద్వారా ఐపీఎల్‌లో బోణీ కొట్టాలని కృతనిశ్చయంతో కనిపిస్తోందీ ఫాఫ్ టీమ్. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే.. దాని దుష్ప్రభావం జట్టు ఆటగాళ్లపై పడుతుంది.

కాగా- ఈ మ్యాచ్‌ సందర్భంగా కొందరు ప్లేయర్లు తమ వ్యక్తిగత రికార్డులను సవరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మాజీ కేప్టెన్ విరాట్ కోహ్లీ.. ఒకే దెబ్బకు రెండు రికార్డులను నెలకొల్పే అవకాశాన్ని కల్పించిందీ మ్యాచ్. ఒకటి సిక్సర్లు- విరాట్ కోహ్లీ ఇంకో నాలుగు సిక్సర్లను బాదితే- ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొల్లార్డ్‌ను అధిగమించేస్తాడు. ఐపీఎల్‌లో కీరన్ పొల్లార్డ్ పేరు మీద 214 సిక్సర్ల రికార్డ్ ఉంది. కోహ్లీ ఖాతాలో ఉన్న సిక్సర్ల సంఖ్య 211. మూడు కొడితే రికార్డు సమం.. నాలుగు కొడితే కొత్త రికార్డును నెలకొల్పినట్టవుతుంది.

 IPL 2022, RCB vs KKR: Kohli needs 3 more sixes to overtake Kieron Pollard as 214 sixes

కోల్‌కత నైట్ రైడర్స్ ప్లేయర్ అజింక్య రహానె 4,000 పరుగుల మైలురాయికి సమీపంలో ఉన్నాడు. 15 పరుగులు చేస్తే అతను ఈ క్లబ్‌లో చేరతాడు. ఈ క్లబ్‌లో చేరిన తొమ్మిదో ప్లేయర్ అవుతాడు. అలాగే- వేగంగా ఈ ల్యాండ్ మార్క్‌ను అందుకున్న అయిదో ప్లేయర్‌గా కూడా రహానె గుర్తింపు సాధిస్తాడు. నైట్ రైడర్స్ కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఇంకో రెండు ఫోర్లను కొడితే- ఈ కేటగిరీలో 200 మైల్‌స్టోన్ అందుకున్నవాడవుతాడు.

కోల్‌కత ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్స్ పేరు మీద కూడా ఓ రికార్డ్ ఉంది. ఒక సీజన్ టోర్నమెంట్‌లో 75 సిక్సర్లను కొట్టిన ఘనత అతని పేరు మీదే ఉంది. ఈ రికార్డును సాధించిన మరో ప్లేయర్ కేఎల్ రాహుల్. ఒకే టోర్నమెంట్‌లో 78 సిక్సర్లను బాది అవతల పడేశాడీ లక్నో సూపర్ జెయింట్స్ కేప్టెన్. ఇలా బెంగళూరు-కోల్‌కత జట్లల్లో ప్లేయర్లు తమ వ్యక్తగత రికార్డులను నెలకొల్పుకోవడానికి ఈ మ్యాచ్ అవకాశం ఇచ్చింది.

Story first published: Wednesday, March 30, 2022, 12:07 [IST]
Other articles published on Mar 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+