ఆర్సీబీ గెలిచినా.. టెన్షనే: ప్లేఆఫ్స్‌కు అదొక్కటే ప్రధాన అడ్డు: ముంబై ఇండియన్స్‌పై ఆశలు

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ ప్లేఆఫ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరింత చేరువైంది. లీగ్స్‌లో తన చివరి మ్యాచ్‌లో టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌ను మట్టి కరిపించింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి మ్యాచ్‌ను గెలుచుకోవడం ద్వారా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్‌కు ఉన్న అడ్డంకి- ఢిల్లీ కేపిటల్స్. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఈ రిషభ్ పంత టీమ్.. ఇంకో మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. ముంబై ఇండియన్స్‌తో తలపడాల్సి ఉంది. రాయల్ ఛాలెంజర్స్- ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలవాల్సి ఉంటుంది.

ఢిల్లీ అడ్డు..
ఇందులో ఢిల్లీ నెగ్గితే- తానూ 16 పాయింట్లను సాధించుకుని.. రాయల్ ఛాలెంజర్స్‌కు సమవుజ్జీగా నిలుస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ ఖాతాలో ఉన్న పాయింట్లు.. 14. ముంబై ఇండియన్స్‌పై ఓడిపోతే- అక్కడితోనే దాని ప్రస్థానం ఆగిపోతుంది. లగేజీ సర్దుకుంటుంది. గెలిస్తే మాత్రం నెట్ రన్‌రేట్ ప్రభావం చూపుతుంది. ఢిల్లీ కేపిటల్స్ ఓడితే మాత్రం- బెంగళూరుకు బెంగ ఉండదు. గురువారం రాత్రి నాటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై మంచి రన్‌రేట్ గెలిచింది బెంగళూరు. 168 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇది ఆ జట్టుకు ఒకింత కలిసొచ్చే అంశం. బెంగళూరు నెట్ రన్‌రేట్ -0.253 కాగా, ఢిల్లీది 0.255.

కోహ్లీ విజృంభణ..
గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విజృంభించాడు. ఇన్ని రోజుల ఫ్రస్ట్రేషన్ మొత్తాన్నీ గుజరాత్‌పై తీర్చేసుకున్నాడు.. ఫ్యాన్స్‌కు ఫన్ పంచాడు. పరుగుల కరవు తీర్చుకున్నాడీ మ్యాచ్‌తో. 54 బంతుల్లో రెండు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 73 పరుగులు చేశాడు. ఫాఫ్ సైతం స్వేచ్ఛగా ఆడాడు. 38 బంతుల్లో అయిదు ఫోర్లతో 44 పరుగులు చేశాడు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 115 పరుగులు జోడించడంతోనే రాయల్ ఛాలెంజర్స్ విజయం దాదాపుగా ఖాయమైంది.

మ్యాక్సీ.. మ్యాడ్ ఇన్నింగ్
మంచి రన్‌రేట్‌తో గెలవాలనే ఉద్దేశంతో ఫస్ట్‌డౌన్‌లోకి గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను దింపింది టీమ్. అది సత్ఫలితాలను ఇచ్చింది. 18 బంతుల్లో రెండు సిక్సర్లు, అయిదు ఫోర్లతో మ్యాక్స్‌వెల్ చెలరేగాడు. 18 బంతుల్లో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 146 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పటికీ.. పెద్దగా ఆందోళన చెందనక్కర్లేకుండా పోయింది. ఆ తరువాత సరిగ్గా ఆరు బంతుల్లో మ్యాచ్ ముగిసిపోయింది. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో దినేష్ కార్తీక్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం కూడా ఇవ్వకుండా మ్యాడ్ ఇన్నింగ్ ఆడాడు మ్యాక్స్‌వెల్.

భాగస్వామ్యాన్ని విజయంగా..
ఫాఫ్ డుప్లెసిస్-విరాట్ కోహ్లీల భారీ భాగస్వామ్యాన్ని విజయవంతంగా మలచుకోగలిగింది రాయల్ ఛాలెంజర్స్. రాయల్‌గా ఆడింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. కీలక బ్యాటర్లు సకాలంలో ఫామ్‌ను అందిపుచ్చుకోగలిగారు. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. బౌలింగ్‌లో చేసిన ప్రయోగాలను తిప్పికొట్టగలిగారు.

ఫర్వాలేదనిపించుకున్న బౌలింగ్..
ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ కొంత బలహీనంగా కనిపించింది. ప్లేఆఫ్స్‌లోకి వెళ్లడమంటూ జరిగితే- దీన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. సిద్ధార్థ్ కౌల్-43, జోష్ హేజిల్‌వుడ్-39 పరుగులు ఇచ్చుకున్నారు. హేజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మ్యాక్స్‌వెల్, వనిందు హసరంగ ఒక్కో వికెట్ పడగొట్టారు. గుజరాత్ టైటాన్స్‌ను ఆలౌట్ చేయలేకపోవడం మైనస్ పాయింట్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications