
అద్భుతంగా రాణిస్తోన్న సంజు సేన
ఈ సీజన్ రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా రాణిస్తోంది. ఓటమి అనేదే రుచి చూడలేదు. భారీ స్కోర్లతో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడుతోంది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తొలుత బ్యాటింగ్ చేసి 210 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్‌పై జరిగిన రెండో మ్యాచ్‌లోనూ అదే స్థాయిలో విజృంభించింది. 193 పరుగులను జత చేసింది. ఈ రెండింట్లోనూ అటు బ్యాటర్లు, బౌలర్లు సమంగా రాణించారు. ప్రత్యర్థిని మట్టి కరిపించారు. ఇవ్వాళ్టి మ్యాచ్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్‌పై తన ఫామ్‌ను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. జోస్ బట్లర్ సెంచరీతో ఊపు మీద ఉన్నాడు.

ఆల్‌రౌండర్లతో..
జోష్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్, షిమ్రోన్ హెట్మెయిర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజువేందర్ చాహల్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు, ఆల్ రౌండర్లతో నిండివుందీ పింక్ టీమ్. ఆడిన రెండు మ్యాచ్‌లల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసి, భారీ స్కోర్లను సాధించింది. దీన్ని బట్టి చూస్తే ఈ మ్యాచ్‌లో కూడా టాస్ గెలిస్తే సంజు సేన.. తొలుత బ్యాటింగ్ తీసుకోవడానికే మొగ్గు చూపొచ్చు. సో- ఈ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది.

పరాజయంతో..
బెంగళూరు మాత్రం పరాజయంతో ఈ సిరీస్‌ను ఆరంభించింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. 205 పరుగుల భారీ స్కోర్ సాధించినప్పటికీ.. దాన్ని కాపాడుకోలేకపోయింది. రాయల్ ఛాలెంజర్స్ ఖాతాలో ఇదో దిగ్భ్రాంతికర పరాజయంగా చెప్పుకోవచ్చు. రెండో మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌పై విజయం సాధించడం ద్వారా ఐపీఎల్‌లో బోణీ కొట్టింది. దాన్ని కొనసాగించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. నైట్‌రైడర్స్‌పై మ్యాచ్‌లో 132 పరుగులే చేసినప్పటికీ.. దాన్ని కాపాడుకోవడం రాయల్ ఛాలెంజర్స్ బౌలర్ల సత్తాకు అద్దం పడుతోంది.

బ్యాటింగ్ బౌలింగ్‌లో బలంగా..
బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్‌లో కోల్‌కతకు ఏ మాత్రం తీసిపోదు. ఫాఫ్ డుప్లెసిస్.. తన సత్తా ఏమిటో తొలి మ్యాచ్‌లోనే నిరూపించుకున్నాడు. 88 పరుగులు చేశాడు. కింగ్ కోహ్లీ, దినేష్ కార్తీక్, షెర్ఫానె రూథర్‌ఫర్డ్, షాబాజ్ అహ్మద్.. బ్యాటింగ్‌లో రాణించే సత్తా ఉంది. వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ వంటి బౌలర్లు జట్టులో ఉన్నారు. కోల్‌కత నైట్‌రైడర్స్‌పై ఆడిన జట్టుతోనే రాయల్ ఛాలెంజర్స్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది.

తుదిజట్టులో..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టులో- ఫాఫ్ డుప్లెసిస్ (కేప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షెర్ఫానె రూథర్‌ఫర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ చోటు దక్కించుకోవచ్చు. రాజస్థాన్ తరఫున- జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కేప్టెన్), షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవ్‌దీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యజువేందర్ చాహల్ ఆడే అవకాశం ఉంది.

డ్రీమ్ టీమ్ 11 ఫాంటసీ క్రికెట్‌లో
డ్రీమ్ టీమ్ 1: జోస్ బట్లర్ (కేప్టెన్), సంజు శాంసన్, షిమ్రోన్ హెట్మెయిర్, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (వైస్ కేప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, యజువేందర్ చాహల్, ప్రసిద్ధ్ కృష్ణకు స్థానం కల్పించవచ్చు. రిస్కీ కేప్టెన్సీ ఛాయిస్ విషయానికి వస్తే రియాన్ పరాగ్‌ను జట్టులోకి తీసుకోవడం సాహసమే అవుతుంది. హర్షల్ పటేల్.. నిలకడగా రాణించడం అతనికి కలిసి వచ్చింది.


Click it and Unblock the Notifications
