సూపర్ సండే: కోహ్లీ కొత్త అవతారం: కొత్త కేప్టెన్‌తో కలిసి: తుది జట్టులో


ముంబై: ఐపీఎల్ 2022లో భాగంగా ఇవ్వాళ రెండు హైఓల్టేజ్ మ్యాచ్‌లు ఇవ్వాళ క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించనున్నాయి. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ను ఢిల్లీ కేపిటల్స్ ఢీ కొట్టనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈ సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. సాయంత్రం 7:30 గంటలకు మొదలయ్యే మరో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. రిజల్ట్ ఎలా ఉన్నా- ఈ రెండు జట్లూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం ఖాయం.

కొత్త కొత్తగా..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కొత్తగా కనిపిస్తోంది. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో కొత్త కేప్టెన్ డెబ్యూ కానున్నాడు. బెంగళూరు జట్టుకు సుదీర్ఘకాలం పాటు సారథ్యాన్ని వహించిన విరాట్ కోహ్లీ తప్పుకోవడం వల్ల ఖాళీ అయిన కేప్టెన్సీ స్థానాన్ని ఫాఫ్ డుప్లెసిస్ భర్తీ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ తరఫున కేప్టెన్‌గా తొలి మ్యాచ్‌ను ఆడనున్నాడీ దక్షిణాఫ్రికా ప్లేయర్. గత సీజన్ వరకూ అతను చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. ఈ సారి ఫ్రాంఛైజీ మారాడు.

ఆస్ట్రేలియన్లు దూరం..
కీలకమైన ఆస్ట్రేలియన్ ప్లేయర్లందరూ దూరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జట్టు కూర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఆసీస్ ప్లేయర్లు మరో అయిదు మ్యాచ్‌ల వరకూ ఐపీఎల్‌కు అందుబాటులో ఉండట్లేదు. వారంతా పాకిస్తాన్‌తో సిరీస్ ఆడుతున్నారు. ఆ సిరీస్ ముగిసిన తరువాతే ఐపీఎల్ జట్లతో జాయిన్ అవుతారు. ఫలితంగా- తుది జట్టు ఎలా ఉండబోతోందనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. కొన్ని అనూహ్య కూర్పులు ఉండొచ్చు.

ఓపెనర్లుగా..
ఫాఫ్ డుప్లెసిస్-విరాట్ కోహ్లీ ఇన్నింగ్‌ను ఆరంభించడం ఖాయంగా కనిపిస్తోంది. ఓపెనర్‌గా మరో ప్రత్యామ్నాయం- అనూజ్ రావత్. ఇన్నింగ్ భారీ స్కోర్ సాధించడానికి ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో అనూజ్ రావత్‌తో ప్రయోగాలు చేయకపోవచ్చు రాయల్ ఛాలెంజర్స్ మేనేజ్‌మెంట్. అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ఫాఫ్-కోహ్లీని ఓపెనర్లుగా కొనసాగించవచ్చు. విరాట్ కోహ్లీ తన పొజీషన్‌ను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే అతని స్థానంలో అనూజ్ రావత్‌ను క్రీజ్‌లోకి పంపించనుంది మేనేజ్‌మెంట్.

మ్యాక్సీ అందుబాటులో వచ్చే వరకు
తన దేశ జాతీయ జట్టు తరఫున పాకిస్తాన్‌తో సిరీస్ ఆడుతోన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ జట్టులో చేరేంత వరకు డుప్లెసిస్-విరాట్ కోహ్లీ ఇన్నింగ్‌ను ఆరంభిస్తారు. మ్యాక్స్‌వెల్ జట్టుతో చేరిన తరువాత.. పొజీషన్ మార్చుకుంటారనే అంచనాలు ఉన్నాయి. అనూజ్ రావత్.. ఓపెనర్‌గా దిగుతాడని తెలుస్తోంది. ఇదివరకు దేవ్‌దత్ పడిక్కల్‌తో కలిసి విరాట్ కోహ్లీ జట్టును ఆరంభించేవాడు. పడిక్కల్ ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్‌తో లేడు. అందుకే- ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ కొంత ఇబ్బందికరంగా తయారైంది.

తుదిజట్టులో..
ఇవ్వాళ పంజాబ్ కింగ్స్‌ను ఎదుర్కొనబోయే రాయల్ ఛాలెంజర్స్ తుదిజట్టులో- ఫాఫ్ డుప్లెసిస్ (కేప్టెన్), విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రార్, అనూజ్ రావత్, షెర్ఫానె రూథర్‌ఫర్డ్, ఫిన్ అల్లెన్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ ఆడటం దాదాపు ఖాయమైనట్టే. పంజాబ్ కింగ్స్‌లో శిఖర్ ధవన్, మయాంక్ అగర్వాల్ (కేప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, షారుఖ్ ఖాన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ఓడియన్ స్మిత్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, సందీప్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications