Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నల్లరంగు రిబ్బన్ బ్యాండ్ కట్టుకుని మ్యాచ్ ఆడిన రాయల్ ఛాలెంజర్స్ ప్లేయర్లు: కారణమేంటీ?

IPL 2022: RCB players wearing black armbands during the match against CSK, here is the reason

ముంబై: మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆకలి తీరింది. చీరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. అసలు సిసలు ఛాంపియన్‌లా ఆడింది. నాలుగు మ్యాచ్‌లల్లో అవమానకరంగా ఓడిపోయిన ఈ జట్టు అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అయింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా మంగళవారం రాత్రి నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ల తుక్కు రేగ్గొట్టింది. రాబిన్ ఉతప్ప-శివం దుబే కళ్లు చెదిరేలా బ్యాటింగ్ చేశారు. ప్రత్యర్థికి 217 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగారు.

బౌలర్లు ఫ్లాప్..

బౌలర్లు ఫ్లాప్..

ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లది ఫ్లాప్ షో. మొయిన్ అలీ రనౌట్ పక్కన పెడితే- ఆరుమంది బౌలర్లు కలిసి పడగొట్టింది మూడు వికెట్లే. 20 ఓవర్లలో ఏకంగా 216 పరుగులను సమర్పించుకున్నారు. ఏ ఒక్క బౌలర్ కూడా మెరుగైన రన్‌రేట్‌ను నమోదు చేయలేదు.

ఆకాశ్ దీప్ మరీ ఘోరం. అతని నాలుగు ఓవర్ల కోటా నుంచి ఉతప్ప-దుబే ద్వయం 58 పరుగులను పిండుకుంది. స్టార్ స్పిన్నర్ హసరంగదీ ఇదే పరిస్థితి. అతని వాటా మూడు ఓవర్లల్లో 35 పరుగులు. రెండు వికెట్లు పడగొట్టడం కొంత ఊరట.

హర్షల్ లేని లోటు..

హర్షల్ లేని లోటు..

ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్.. చేతులెత్తేశారు. పిచ్ మీద పడి లేచిన బంతి.. ఆ తరువాత కనిపించేది ఫెన్సింగ్ అవతలే. బంతిని ఎలా వేసినా కొట్టారు.. ఎక్కడ వేసినా బాదారు. పూనకం పూనినట్లు ఆడారిద్దరూ. పొదుపుగా బౌలింగ్ చేసే హర్షల్ పటేల్ లేని లోటు రాయల్ ఛాలెంజర్స్‌కు ఈ మ్యాచ్‌లో కొట్టొచ్చినట్టు కనిపించింది. అతను ఉండి వుంటే కొంతయినా బౌలింగ్ డిపార్ట్‌మెంట్ బలంగా ఉండేదనిపించేలా చేసింది.

చెల్లెలు మరణంతో..

చెల్లెలు మరణంతో..

తన చెల్లెలు అర్చిత పటేల్ మరణించడంతో హర్షల్ పటేల్ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. పుణెలో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ముగిసిన వెంటనే హర్షల్ పటేల్ స్వస్థలానికి బయలుదేరి వెళ్లాడు. బీసీసీఐ అమలు చేస్తోన్న బయో బబుల్‌ను బ్రేక్ చేయాల్సి రావడం వల్ల మూడు రోజుల పాటు క్వారంటైన్ కాలాన్ని సైతం అతను గడపాల్సి వస్తోంది. ఫలితంగా అతను ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. అతని స్థానంలో హేజిల్‌వుడ్‌ను తీసుకుంది మేనేజ్‌మెంట్.

బ్లాక్ రిబ్బన్లతో..

బ్లాక్ రిబ్బన్లతో..

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ప్లేయర్లు చేతికి నల్లరంగు రిబ్బన్‌ను కట్టుకోవడానికి కూడా కారణం ఇదే. ప్లేయర్లందరూ తమ కుడి చేతికి ఈ రిబ్బన్ కట్టుకుని కనిపించారు. తమ తోటి ప్లేయర్ ఇంట్లో చోటు చేసుకున్న విషాదానికి సంతాప సూచకంగా దీన్ని ధరించారు. మ్యాచ్ ఆరంభం కావడానికి ముందు కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్లు, కోచ్, సపోర్టింగ్ స్టాఫ్.. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అతని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రతి మ్యాచ్‌లో వికెట్..

ప్రతి మ్యాచ్‌లో వికెట్..

ఈ సీజన్‌లో హర్షల్ పటేల్ నిలకడగా రాణిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ వికెట్లను పడగొడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లో ఆరు వికెట్లు తీసుకున్నాడు. తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడినప్పటికీ.. బౌలర్‌గా హర్షల్ సక్సెస్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లల్లో 36 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. కోల్‌కత నైట్ రైడర్స్-2, రాజస్థాన్ రాయల్స్-1, ముంబై ఇండియన్స్‌-2 వికెట్లు తీసుకున్నాడు. అయిదు మ్యాచ్‌కు అందుబాటులో లేడు.

Story first published: Wednesday, April 13, 2022, 8:54 [IST]
Other articles published on Apr 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+