మాక్స్‌వెల్ ఆడడం లేదు
నేటి మ్యాచ్‌లోనూ ఆర్సీబీ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెయిన్ మాక్స్‌వెల్ ఆడడం లేదు. ఈ విషయాన్ని ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మైక్ హెస్సన్ అధికారికంగా ధృవికరించాడు. 9న పుణే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్ నుంచి మాక్స్ ఆర్సీబీ జట్టుకు అందుబాటులో ఉంటాడని ఆయన తెలిపాడు. దీంతో నేటి మ్యాచ్‌లో మాక్స్‌వెల్ ఆడతాడని భావించిన అభిమానులకు ఇది నిరాశజనక వార్త అనే చెప్పుకోవాలి. జట్టుతో కలిసినప్పటికీ మాక్స్‌వెల్ నేటి మ్యాచ్‌లో ఆడకపోవడానికి క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనలే కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే క్రికెట్ ఆస్ట్రేలియా రూల్స్ ప్రకారం ఆస్ట్రేలియా ఆటగాళ్లెవరూ కూడా ఏప్రిల్ 6 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడకూడదు. దీంతో మ్యాచ్‌కు ఫిట్‌గా ఉన్నప్పటికీ మాక్స్‌వెల్ నేడు బెంచ్‌కే పరిమితం కానున్నాడు. కాగా ప్రస్తుతం మాక్స్‌వెల్ స్థానంలో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ఆర్సీబీ జట్టులో ఆడుతున్నాడు.

పెళ్లి కారణంగా ఆలస్యం
కాగా పెళ్లి కారణంగా ఐపీఎల్‌లో ఆలస్యంగా అడుగుపెట్టిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెయిన్ మాక్స్‌వెల్ ఇటీవల ఇండియా చేరుకుని 3 రోజు క్వారంటైన్ పూర్తి చేసుకున్నాడు. అనంతరం జట్టుతో కలిసి ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఇక గత సీజన్లో రాణించడంతో మెగా వేలానికి ముందే మాక్స్‌వెల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసుకుంది. కాగా మార్చి 27న భారత్ సంతతికి చెందిన యువతిని మాక్స్‌వెల్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

పూర్తి జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, సిద్దార్థ కౌల్, కర్ణ్ శర్మ , చామ వి మిలింద్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, ఫిన్ అలెన్, సుయాష్ ప్రభుదేసాయి, గ్లెయిన్ మాక్స్‌వెల్, అనీశ్వర్ గౌతమ్.

రాజస్థాన్ రాయల్స్:
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, కరుణ్ నాయర్, జేమ్స్ నీషమ్, రాస్సీ డెర్ దుస్సేన్, కెసి కరియప్ప, డారిల్ మిచెల్, ఒబెడ్ మెక్‌కాయ్, తేజస్ బరోకా, కుల్దీప్ యాదవ్, అనునయ్ సింగ్, కుల్దీప్ సేన్, నాథన్ కౌల్టర్-నైల్, ధ్రువ్ జురెల్, శుభమ్ గర్వాల్


Click it and Unblock the Notifications












