IPL 2022: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్.. ఆ స్టార్ ప్లేయర్ కూడా వచ్చేస్తున్నాడు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెయిన్ మాక్స్‌వెల్ చేరడంతో ఆ జట్టు అభిమానులు ఆనందంలో ఉన్నారు. మాక్స్‌వెల్ నేడు రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు కాకపోయినా తర్వాతి మ్యాచ్ నుంచి జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు. కాగా ఇంతలోనే ఆర్సీబీకి మరో గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు మెగా వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా త్వరలో టీం క్యాంపులో అడుగుపెట్టనున్నాడు. ఈ నెల 12న చెన్నైసూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడనున్న మ్యాచ్‌కు జోష్ హేజిల్‌వుడ్ అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి.
కాగా ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో జోష్ హేజిల్‌వుడ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 కోట్ల 75 లక్షల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఆస్ట్రేలియా జట్టు ఇటీవల పాకిస్థాన్‌లో పర్యటించడంతో జోష్ హేజిల్‌వుడ్ ఐపీఎల్ 2022లో ఇంకా అడుగుపెట్టలేదు. తాజాగా ఆ పర్యటన ముగియడంతో త్వరలోనే జోష్ హేజిల్‌వుడ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు క్యాంపులో చేరనున్నాడు. ఇక ఐపీఎల్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన జోష్ హేజిల్‌వుడ్ 12 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 3/24గా ఉన్నాయి. ఇక ఐపీఎల్ 2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నేడు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.

పూర్తి జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, సిద్దార్థ కౌల్, కర్ణ్ శర్మ , చామ వి మిలింద్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, ఫిన్ అలెన్, సుయాష్ ప్రభుదేసాయి, గ్లెయిన్ మాక్స్‌వెల్, జోష్ హెజిల్‌వుడ్, అనీశ్వర్ గౌతమ్.
రాజస్థాన్ రాయల్స్:
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, కరుణ్ నాయర్, జేమ్స్ నీషమ్, రాస్సీ డెర్ దుస్సేన్, కెసి కరియప్ప, డారిల్ మిచెల్, ఒబెడ్ మెక్‌కాయ్, తేజస్ బరోకా, కుల్దీప్ యాదవ్, అనునయ్ సింగ్, కుల్దీప్ సేన్, నాథన్ కౌల్టర్-నైల్, ధ్రువ్ జురెల్, శుభమ్ గర్వాల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications