
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నాడని, అతను ఇదే ఫిట్‌నెస్ కొనసాగిస్తే రానున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టులో కచ్చితంగా చోటు దక్కుతుందని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాండ్యా ఫిట్‌నెస్ గురించి రవి శాస్త్రి మాట్లాడాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్నాడని అన్నాడు. హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సాధించడానికి చాలా కష్టపడ్డాడని చెప్పుకొచ్చిన ఆయన ఇదే ఫిట్‌నెస్ కొనసాగిస్తే ఈ ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో చోటు ఖాయమని అభిప్రాయపడ్డాడు. హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌తో ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశమని, అతని లాంటి ఆటగాడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే మరింత చెలరేగి ఆడతాడని తెలిపాడు.
ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్‌ను కల్గి ఉన్నాడని రవి శాస్త్రి ప్రశింసించాడు. హార్దిక్ పాండ్యా మంచి ఫీల్డర్, బౌలర్ కూడా అని చెప్పాడు. హార్దిక్ పాండ్యా మ్యాచ్ విన్నర్ అని రవిశాస్త్రి అన్నాడు. కాగా సోమవారం గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌నెస్‌తో కనిపించాడు. పూర్తి బౌలింగ్ కోటాను వేయడంతోపాటు బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. వికెట్లు తీయకపోయినప్పటికీ గంటకు 130 కిలో మీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేసి మళ్లీ పాత హార్దిక్ పాండ్యాను గుర్తు చేశాడు. అలాగే బ్యాటింగ్ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో 33 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్‌ను ఆదుకున్నాడు.
ఇక లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లు దీపక్ హుడా, ఆయుష్ బడోని హాఫ్ సెంచరీలతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లతో గుజరాత్ టైటాన్స్ టాపార్డర్‌ను కూల్చాడు. ఇక లక్ష్య చేధనలో గుజరాత్ బ్యాటర్లలో రాహుల్ తెవాటియా, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, మాథ్యూ హెడ్ రాణించారు. మహ్మద్ షమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.