Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ మీద రెచ్చిపోవడం భలే కిక్కిచ్చిందన్న రషీద్ ఖాన్..

IPL 2022: Rashid Khan Makes Spicy Statements On SRH Team After Winning Yesterday Game

సన్ రైజర్స్ మాజీ ప్లేయర్, ప్రస్తుత గుజరాత్ టైటాన్స్ హీరో రషీద్ ఖాన్.. నిన్నటి మ్యాచ్‌లో వీరోచితమైన బ్యాటింగ్‌తో గుజరాత్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం రషీద్ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి ఇన్నింగ్స్ సన్ రైజర్స్ మీద ఆడడం మరింత సంతోషాన్నిచ్చిందన్నాడు. రషీద్ ఖాన్‌ను ఈ వేలంలో సన్ రైజర్స్ రిటైన్ చేసుకోని సంగతి తెలిసిందే. దీంతో అతన్ని రూ.15కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. తన పాత జట్టు సన్ రైజర్స్ మీద ఆడడాన్ని పూర్తిగా ఆస్వాదించానని.. సన్ రైజర్స్ మీద గెలిపించేలా ఆడడం కిక్ ఇచ్చిందని పేర్కొన్నాడు.

ఈ ఇన్నింగ్స్ ఇచ్చిన ఫీలింగ్ బాగుంది

ఈ ఇన్నింగ్స్ ఇచ్చిన ఫీలింగ్ బాగుంది

మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ ఇన్నింగ్స్‌ ఇచ్చిన ఫీలింగ్ బాగుంది. క్రీజులోకి వెళ్లడం, ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడం, బలంగా సిక్సర్లు కొట్టడం అన్నీ అనుకున్నట్లు జరిగాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ టీం మీద ఈ ఇన్నింగ్స్ ఆడడం ఇంకా సంతోషంగా ఉంది. నేను నా గేమ్ ఆడేందుకు ప్రయత్నించాను. రెండేళ్లుగా నా బ్యాటింగ్‌ కూడా మెరుగుపర్చుకునేందుకు తీవ్రంగా శ్రమించాను. తప్పకుండా బ్యాటింగ్లోనూ రాణిస్తాననే నమ్మకాన్ని కలిగి ఉన్నా.

చివరి ఓవర్లో 22పరుగులు చేయాల్సిన టైంలో.. మన అత్యుత్తమ బౌలర్ అయిన ఫెర్గూసన్ ఫస్ట్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 25పరుగులు ఇచ్చాడు.. మనం కూడా 25పరుగులు కొట్టగలమని అవతలి ఎండ్‌లో ఉన్న తెవాతీయాతో చెప్పాను. నమ్మకాన్ని కలిగి ఉండాలని, ఒత్తిడికి గురికావొద్దని, క్రికెట్లో ఏదైనా సాధ్యమేనని సూచించాను. బౌలింగ్లో నేను 4, 5 చెత్త డెలివరీలు వేశాను. వాటి వల్ల నా బౌలింగ్లో భారీ పరుగులొచ్చాయి. నా మనస్సులో అనిపించింది. ఇలాంటి వికెట్‌పై బ్యాటింగ్ చేయడం బాగుంటుందని, అనుకున్నట్లు నాకో అవకాశం వచ్చింది.

ఇక గుజరాత్ టైటాన్స్ బృందంలో భాగం కావడం, ప్రతి ఒక్కరు బాధ్యత వహిస్తూ గేమ్ ఆడడం, ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా మంచి విషయం. గ్రౌండ్లోను, గ్రౌండ్ బయట కెప్టెన్ హార్దిక్ నుండి మాకు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మా ప్రధాన కోచ్ ఆశిష్ జట్టును ఆహ్లాదకర వాతావరణంలో ఆడనిస్తున్నారు. దీంతో మేం మా 100పర్సెంట్ ఆట కనబర్చడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రెండు పాయింట్లు జట్టుకు చివర్లో చాలా ఉపయోగపడతాయి.' అన్నాడు.

4బంతుల్లో 15పరుగులు చేయాల్సిన దశలో..

4బంతుల్లో 15పరుగులు చేయాల్సిన దశలో..

చివరి ఓవర్లో 22పరుగులు కావాల్సిన తరుణంలో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు రషీద్ ఖాన్, రాహుల్ తెవాతీయా భీకరంగా ఆడిన సంగతి తెలిసిందే. మార్కో జాన్సేన్ వేసిన చివరి ఓవర్ తొలి బంతికి రాహుల్ తెవాతీయా సిక్సర్ బాది తర్వాతి బంతికి సింగిల్ తీశాడు. 3వ బంతికి క్రీజులోకి వచ్చిన రషీద్ 4బంతుల్లో 15పరుగులు చేయాల్సిన దశలో.. 3వ బంతికి సిక్సర్ బాదాడు. 4వ బంతికి డాట్ పడగా.. చివరి 5,6 బంతుల్లో సిక్సర్లు బాది మ్యాచ్‌ను గెలిపించాడు.

బౌలింగ్లో మత్రం పేలవం

బౌలింగ్లో మత్రం పేలవం

ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్ మాత్రం పేలవంగా సాగింది. రషీద్ ఖాన్ తన 4ఓవర్లలో 45పరుగులు ఇచ్చాడు. పైగా ఒక్క వికెట్ కూడా తీయలేదు. ముఖ్యంగా సన్ రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మ రషీద్ బౌలింగ్లో రెచ్చిపోయాడు. రషీద్ బౌలింగ్లో 15బంతులను ఎదుర్కొన్న అభిషేక్ 34పరుగులు చేశాడు.

టీ20ల్లో రషీద్ ఖాన్ బౌలింగ్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసినవారిలో 4వ ప్లేస్‌లో ఉన్నాడు. అంతకుముందు క్రిస్ గేల్ (16బంతుల్లో 42), మనన్ వోహ్రా (14బంతుల్లో 37), ఏబీ డివిలియర్ (9బంతుల్లో 35) ఒకే ఇన్నింగ్స్‌లో రషీద్ బౌలింగ్లో అత్యధిక పరుగులు చేసినవారిలో తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

Story first published: Thursday, April 28, 2022, 11:27 [IST]
Other articles published on Apr 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+