
ఐపీఎల్ 2022లో నేడు మరో ఆసక్తిర పోరు జరగనుంది. వాఖండే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేసులో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లోనూ జోరు కొససాగించాలని భావిస్తోంది. ఇక ఒక మ్యాచ్ గెలిచి, ఒక మ్యాచ్ ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల హెడ్ టూ హెడ్ రికార్డులు చర్చకు వస్తున్నాయి.
ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు 25 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో అత్యధికంగా బెంగళూరు 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రాజస్థాన్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 3 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. గత 2 సీజన్లలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌ను బెంగళూరు ఓడించడం గమనార్హం. ఇక రెండు జట్లు తలపడిన ఓ మ్యాచ్‌లో అత్యధికంగా బెంగళూరు 200 పరుగులు చేసింది. అదే రాజస్థాన్ 217 పరుగులు చేసింది. ఇక అత్యల్పంగా బెంగళూరు 70 పరుగులు చేయగా.. రాజస్థాన్ 58 పరుగులు చేసింది.

పూర్తి జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, సిద్దార్థ కౌల్, కర్ణ్ శర్మ , చామ వి మిలింద్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, ఫిన్ అలెన్, సుయాష్ ప్రభుదేసాయి, గ్లెయిన్ మాక్స్‌వెల్, అనీశ్వర్ గౌతమ్.
రాజస్థాన్ రాయల్స్:
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, కరుణ్ నాయర్, జేమ్స్ నీషమ్, రాస్సీ డెర్ దుస్సేన్, కెసి కరియప్ప, డారిల్ మిచెల్, ఒబెడ్ మెక్‌కాయ్, తేజస్ బరోకా, కుల్దీప్ యాదవ్, అనునయ్ సింగ్, కుల్దీప్ సేన్, నాథన్ కౌల్టర్-నైల్, ధ్రువ్ జురెల్, శుభమ్ గర్వాల్