
ఐపీఎల్ 2022కు మరో 10 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఫ్రాంచైజీలన్నీ ఈ మెగా లీగ్ కోసం సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో అనేక జట్లు ఈ సారి కొత్త జెర్సీలతో వస్తున్నాయి. ఇప్పటికే తమ నూతన జెర్సీలను విడుదల చేశాయి. దీంతో ఈ సారి చాలా మంది ఆటగాళ్లు మైదానంలో నూతన జెర్సీల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ జాబితాలో రాజస్థాన్ రాయల్స్ కూడా చేరింది. రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ సీజన్‌కు నూతన జెర్సీతో రానుంది. తాజాగా తమ నూతన జెర్సీని రాజస్థాన్ రాయల్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక వీడియో రూపంలో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో ఒక వ్యక్తి బైక్‌పై అనేక విన్యాసాలు చేస్తూ జెర్సీలను తీసుకొచ్చి చివరకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు ఇస్తాడు. బైక్‌పై సదరు వ్యక్తి చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వీడియోలో సంజు శాంసన్, యుజ్వేంద్ర చాహల్ చివర్లో జెర్సీ ధరించి కనిపించారు. ఇక జెర్సీ విషయానికొస్తే మెజారీటీ భాగం పింక్ షేడ్స్‌ల్లో ఆకట్టుకుంటుంది. అలాగే భుజాలపైన, కాలర్ భాగం ముదురు నీలం రంగులో ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు టైటిల్ స్పాన్సర్ అయినా ప్రీమియం డ్రై ఫ్రూట్ బ్రాండ్ Happilo లోగో జెర్సీ మధ్యలో ఉంది. డాలర్, జియో, రెడ్ బుల్ వంటి ఇతర స్పాన్సర్‌ల లోగోలు కూడా కిట్‌లో ఫ్రేమ్ చేయబడ్డాయి. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ నూతన జెర్సీ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్ ఆరంభ సీజన్లో టైటిల్ విజేతగా నిలిచి సంచలనం సృష్టించిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. కనీసం ఫైనల్ కూడా చేరలేదు. దీంతో కనీసం ఈ సారైన మరోసారి ట్రోఫీ గెలవాలని రాజస్థాన్ రాయల్స్ పట్టుదలగా ఉంది.
రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టు
సంజూ శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్, కెసి కరియప్ప, ఒబెద్ సైని, నవ్‌దీప్ సైని సింగ్, కుల్దీప్ సేన్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్, తేజస్ బరోకా, కుల్దీప్ యాదవ్, శుభమ్ గర్వాల్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డారిల్ మిచెల్.