RR vs KKR Playing 11, Dream 11: ఓటమిలో సమవుజ్జీలు: ఎవరు గెలిచినా అదే కథ

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈ సాయంత్రం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత నైట్‌రైడర్స్ బరిలోకి దిగబోతున్నాయి. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. తలా మూడు మ్యాచుల్లో గెలిచాయి ఈ రెండు జట్లు. ఇదివరకు అగ్రస్థానంలో కొనసాగిన సంజు శాంసన్ సారథ్యంలోని పింక్ టీమ్..ఆ తరువాత చతికిల పడింది. పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో నిలిచింది. కోల్‌కత నైట్‌రైడర్స్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఈ జట్టు స్థానం.. ఆరు.

పడుతూ లేస్తూ..
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మొదట్లో బాగా రాణించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లలో విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో ఓడినా.. ఆ తరువాత లక్నో సూపర్ కింగ్స్‌పై గెలిచి, గాడినపడిందనుకున్న దశలో మళ్లీ ఓడింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపాలైంది. ఇవ్వాళ తన ఆరో మ్యాచ్‌ను ఆడబోతోంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. ఎనిమిది పాయింట్లను సాధిస్తుంది. ఎనిమిది, అంతకుమించిన పాయింట్లు సాధించిన జట్లల్లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

బ్యాటింగ్ భారం జోష్ మీదే..
ఓపెనర్ జోష్ బట్లర్ మీదే బ్యాటింగ్ భారం పడింది. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్, షిమ్రోన్ హెట్మెయిర్, రస్సీ వాన్ డెర్ డూస్సెన్.. అడపాదడపా సత్తా చాటుతున్నారు. వారి బ్యాటింగ్‌లో నిలకడ ఉండట్లేదు. మ్యాచ్‌లు సాగుతున్న కొద్దీ ధీటుగా రాణించాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. డీలా పడుతోంది రాజస్థాన్ బ్యాటింగ్ తీరు. ఇది ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు.

కోల్‌కతదీ అదే తీరు..
కోల్‌కత నైట్‌రైడర్స్‌దీ అదే తీరు. చివరి రెండు మ్యాచ్‌లల్లో ఘోరంగా ఓడింది శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని కోల్‌కత నైట్‌రైడర్స్. ఆరు మ్యాచ్‌లల్లో మూడింట విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఓడితే మరింత పతనం కావడం ఖాయం. బ్యాటింగ్ తురుఫుముక్క వెంకటేష్ అయ్యర్ రాణించట్లేదు. శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా సైతం భారీ స్కోర్‌ను నిలకడగా సాధించట్లేదు. వెంకటేష్ అయ్యర్‌తో కలిసి ఆరోన్ ఫించ్ జట్టు ఇన్నింగ్‌ను ఆరంభించే అవకాశం ఉంది.

తుదిజట్టులో..
రాజస్థాన్ రాయల్స్ జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. విజయాలను అందిస్తోన్న జట్టుతోనే కోల్‌కతను ఢీ కొట్టే అవకాశాలు ఉన్నాయి. జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కేప్టెన్-వికెట్ కీపర్), రస్సీ వాన్‌డర్ డుస్సెన్, షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, జేమ్స్ నీషమ్/ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణ, యజువేందర్ చాహల్ కుల్‌దీప్ సేన్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

కోల్‌కతలో..
కోల్‌కత నైట్‌రైడర్స్ తుదిజట్టులో- వెంకటేష్ అయ్యర్, ఆరోన్ ఫించ్, శ్రేయాస్ అయ్యర్ (కేప్టెన్), నితీష్ రాణా, షెల్డన్ జాక్సన్ (వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమ్మిన్స్, అమన్ ఖాన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.. చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

డ్రీమ్ టీమ్ 11 ఫాంటసీ క్రికెట్‌లో
ఈ రెండు జట్లను కలిపి నిర్మించే డ్రీమ్ టీమ్ 11 ఫాంటసీ క్రికెట్‌లో జోస్ బట్లర్ (కేప్టెన్), శ్రేయాస్ అయ్యర్, షిమ్రోన్ హెట్మెయిర్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్ (వైస్ కేప్టెన్), పాట్ కమ్మిన్స్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, యజువేందర్ చాహల్, ట్రెంట్ బౌల్ట్, కుల్‌దీప్ సేన్‌ను రికమెండ్ చేయవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications