For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs GT Playing 11, Dream 11: డైనమిక్ హార్దిక్ టీమ్‌తో టేబుల్ టాపర్ ఫైట్: తుదిజట్టే కీలకం

IPL 2022, Rajasthan Royals Playing 11 vs GT and Dream team predictions: here the all details to know

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈ సాయంత్రం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగబోతున్నాయి. నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఈ రెండు జట్లు ఇప్పటికే తలా నాలుగు మ్యాచ్‌లు ఆడేశాయి.. మూడింట్లో విజయం సాధించాయి. సంజు శాంసన్ సారథ్యంలోని పింక్ టీమ్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లి కూర్చుంది.

హ్యాట్రిక్ విజయాల అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతిలో ఓటమి పాలైంది గుజరాత్. అయిదో స్థానంలో ఉంది. ఇవ్వాళ్టి మ్యాచ్ ఈ రెండు జట్లకూ కీలకమే. రాజస్థాన్ రాయల్స్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుందా? లేదా అనేది ఈ రాత్రికి తేలిపోతుంది.

అద్భుతంగా రాణిస్తోన్న సంజు సేన

అద్భుతంగా రాణిస్తోన్న సంజు సేన

ఈ సీజన్ రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా రాణిస్తోంది. భారీ స్కోర్లతో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడుతోంది. తొలి రెండు మ్యాచ్‌లల్లో భారీ విజయాలను అందుకుంది. మూడో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ చేతిలో ఓడినా మళ్లీ పుంజుకొంది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది రాజస్థాన్. మూడో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌పై గెలవలేకపోయింది. నాలుగో మ్యాచ్ నాటికి బౌన్స్ బ్యాక్ అయింది. లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. మరో విజయంపై కన్నేసిందీ సంజు టీమ్.

జోరు మీదున్న జోష్

జోరు మీదున్న జోష్

ఓపెనర్ జోష్ బట్లర్ జోరుమీదున్నాడు. అతని దూకుడును అడ్డుకోవడం కష్టమే. యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్, షిమ్రోన్ హెట్మెయిర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజువేందర్ చాహల్ వంటి టాప్ క్లాస్ బ్యాటర్లు, బౌలర్లు రాజస్థాన్‌కు అలవోకగా విజయాలను అందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో నమోదైన సెంచరీ జోష్ బట్లర్ పేరు మీదే ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఫామ్‌లో ఉండటం కలిసి వచ్చింది.

 హైదరాబాద్ చేతిలో ఓడి..

హైదరాబాద్ చేతిలో ఓడి..

గుజరాత్ టైటాన్స్ తాను ఆడిన చివరి మ్యాచ్‌లో ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో దెబ్బతింది. అంతకుముందు హార్దిక్ పాండ్యా టీమ్ హ్యాట్రిక్ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. తొలి మూడు మ్యాచ్‌లల్లో ఘన విజయాలను అందుకుంది. ఆ జట్టు జైత్రయాత్రకు సన్‌రైజర్స్ బ్రేకులు వేసింది. ఈ పరాజయం నుంచి గుజరాత్ టైటాన్స్ తేరుకుని.. తన ఆటతీరును మళ్లీ గాడిన పెట్టుకుంటుందా?, టేబుల్ టాపర్‌తో ఎలా ఫైట్ చేస్తుందనేది ఇవ్వాళ తేలిపోతుంది.

తుదిజట్టులో..

తుదిజట్టులో..

రాజస్థాన్ రాయల్స్ జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. విజయాలను అందిస్తోన్న జట్టుతోనే గుజరాత్‌ను ఢీ కొట్టే అవకాశాలు ఉన్నాయి. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కేప్టెన్), షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవ్‌దీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యజువేందర్ చాహల్ తుదిజట్టులో ఆడే అవకాశం ఉంది. గుజరాత్ టైటాన్స్‌లో మార్పులు ఉండొచ్చు.

సాహా ఎంట్రీ..

సాహా ఎంట్రీ..

ఓపెనర్‌గా పెద్దగా రాణించని మాథ్యూ వేడ్ లేదా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌‌ను పక్కన పెట్టొచ్చు. వేడ్ స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహాను తుదిజట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. తుదిజట్టులో- శుభ్‌మన్ గిల్, మాథ్యూవేడ్ లేదా వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కేప్టెన్), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, దర్శన్ నల్కండేలకు చోటు దక్కొచ్చు.

డ్రీమ్ టీమ్ 11 ఫాంటసీ క్రికెట్‌లో

డ్రీమ్ టీమ్ 11 ఫాంటసీ క్రికెట్‌లో

ఈ రెండు జట్లను కలిపి నిర్మించే డ్రీమ్ టీమ్ 11 ఫాంటసీ క్రికెట్‌లో జోస్ బట్లర్ (కేప్టెన్), సంజు శాంసన్, షిమ్రోన్ హెట్మెయిర్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా (వైస్ కేప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణ, లోకీ ఫెర్గూసన్, రషీద్ ఖాన్‌కు చోటు కల్పించవచ్చు.

Story first published: Thursday, April 14, 2022, 11:58 [IST]
Other articles published on Apr 14, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+