
తాను రాజస్థాన్ రాయల్స్‌కే కాకుండా భవిష్యత్‌లో టీమిండియాకు కూడా అత్యుత్తమ ఫినిషర్‌ను అవుతునానని ఆ జట్టు యువ ఆటగాడు రియాన్ పరాగ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. తన గురించి తనకు గొప్పలు చెప్పుకోవాలని లేదని, కానీ తాను రాజస్థాన్ రాయల్స్‌కే కాకుండా భవిష్యత్‌లో టీమిండియాకు మంచి ఫినిషర్‌ను అవుతాననే నమ్మకం ఉందని ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో 20 ఏళ్ల రియాన్ పరాగ్ ధీమా వ్యక్తం చేశాడు. అందుకు కావాల్సిన నైపుణ్యాలను కూడా సొంతం చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను బ్యాటింగ్, ఫీల్డింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ మెరుగుపడ్డట్టు పరాగ్ తెలిపాడు. ఆల్‌రౌండర్‌గా మంచి నైపుణ్యాలను పెంపొందించ్చుకున్నానని, అయితే తాను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పాడు. ముఖ్యంగా నిలకడగా రాణించాల్సిన అవసరం ఉందని రియాన్ పరాగ్ తెలిపాడు.
భారత అండర్ 19 జట్టు 2018 ప్రపంచకప్ గెలిచిన జట్టులో రియాన్ పరాగ్ సభ్యుడిగా ఉన్నాడు. ఇక ఐపీఎల్ 2022లో రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత సీజన్లోనూ పరాగ్ రాజస్థాన్‌కే ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో రియన్ పరాగ్ అప్పుడప్పుడు రాణిస్తున్నప్పటికీ నిలకడైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. దీంతో ఈ సారి మెగా వేలంలో పరాగ్‌ను రాజస్థాన్ రాయల్స్ వదిలేసినప్పటికీ వేలంలో మళ్లీ కొనుగోలు చేసింది. ఏకంగా 3 కోట్ల 80 లక్షల రూపాయలకు దక్కించుకుంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్‌లో రియాన్ పరాగ్ గొప్ప ఇన్నింగ్స్‌లు ఏమి ఆడలేదు. ఇప్పటివరకు 35 మ్యాచ్‌లు ఆడగా 15 సగటుతో 382 పరుగులు మాత్రమే చేశాడు. ఒకే సారి హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇక బౌలింగ్‌లో 4 వికెట్లు తీశాడు.
రాజస్థాన్ రాయల్స్ పూర్తి స్క్వాడ్
సంజూ శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రాన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్, కేసీ కరియప్ప, నవదీప్ సైనీ, ఒబేద్ మెకాయ్, అరుణయ్ సింగ్, కుల్దీప్ సేన్, కరుణ్ జురెల్, దహ్రూవ్ నాయర్, , తేజస్ బరోకా, కులదీప్ యాదవ్, శుభమ్ గర్వాల్, డారిల్ మిచెల్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, నాథన్ కౌల్టర్-నైల్, జేమ్స్ నీషమ్