IPL 2022: బాలీవుడ్ హిట్ సాంగ్‌తో కొత్త ఆటగాళ్లకు రాజస్థాన్ రాయల్స్ వెల్‌కమ్.. వీడియో వైరల్

ఐపీఎల్ 2022 మెగా వేలం ముగిసింది. దీంతో ఏ జట్టులో ఏ ఏ ఆటగాళ్లు ఉండనున్నారనే అంశంపై స్పష్టత వచ్చింది. అలాగే అన్ని జట్ల పూర్తి స్క్వాడ్‌లు కూడా సిద్ధమయ్యాయి. అలాగే ఈ సారి వేలంలో అనేక మంది ఆటగాళ్లు జట్లు మారారు. చాలా మంది గతంలో ఉన్న జట్లకు కాకుండా ఈ సారి వేరే జట్ల తరఫున ఆడనున్నారు. అలాగే రాజస్థాన్ రాయల్స్‌లోకి కూడా ఈ సారి అనేక మంది కొత్త ఆటగాళ్లు వచ్చారు. దీంతో వాళ్లందరికీ ఆ జట్టు గ్రాండ్‌గా వెల్‌కమ్‌గా చెప్పింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ చిత్రంలోని ఓ హిట్ పాట ద్వారా నూతన ఆటగాళ్లను ఆహ్వానించింది. బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన ఓం శాంతి ఓం పాటకు ఫేస్ మార్ఫింగ్ చేసి వీడియోను రూపొందించింది. ఆ వీడియోలో షారూక్ ఖాన్ ప్లేసులో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మోహాన్ని మార్ఫింగ్ చేసింది.
మిగతా వారికి ఈ సారి జట్టులో చేరుతున్న నూతన ఆటగాళ్ల మోహాలను మార్ఫింగ్ చేసింది. అలా ఓం శాంతి ఓం అనే వీడియో సాంగ్‌ను రిక్రియేట్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ రిక్రియేట్ చేసిన వీడియో ప్రకారం ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసను కొత్త ఆటగాళ్లను ఓం శాంతి ఓం పాట పాడుతూ జట్టులోకి ఆహ్వానిస్తున్నాడు. ఈ క్రమంలో వారందరితో నృత్యం కూడా చేస్తున్నాడు. ఇలా యుజ్వేంద్ర చాహల్, జిమ్మీ నీషమ్, షిమ్రోన్ హెట్మేయర్, రవిచంద్రన్ అశ్విన్ వంటి తదితర ఆటగాళ్లతో పాటు శాంసన్ డ్యాన్స్ చేస్తూ వీడియోలో ఉల్లాసంగా కనిపిస్తున్నారు. వీడియో చివర్లో రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ కుమార సంగక్కర్ కూడా కనిపించడం గమనించవచ్చు. దీంతో ఫేస్ మార్ఫింగ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2022 కోసం రాజస్థాన్ రాయల్స్ స్క్వాడ్:
సంజూ శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్, కెసి కరియప్ప, ఒబెద్ సైని, నవ్‌దీప్ సైని సింగ్, కుల్దీప్ సేన్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్, తేజస్ బరోకా, కుల్దీప్ యాదవ్, శుభమ్ గర్వాల్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, డారిల్ మిచెల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications