
కుమార సంగక్కర, లసిత్ మలింగ వంటి దిగ్గజాలతో కూడిన కోచింగ్ స్టాఫ్ ఉండడం ఈ సారి తమకు కలిసొచ్చే అంశం అని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ ప్రతి బౌలర్‌కు సులభతరమైన మెళకువలు నేర్పిస్తున్నాడని చెప్పాడు. తనకు కూడా మంచి సహకారం అందిస్తున్నాడని పేర్కొన్నాడు. ఇక బ్యాటింగ్‌లో హెడ్ కోచ్ కుమార సంగక్కర మెళకువలు ఎంతగానే ఉపయోగపడతాయని చెప్పాడు.
ఈ సారి తమ జట్టు కప్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సంజూ శాంసన్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. అలాగే గత రెండు మూడు సీజన్లుగా తాము చాలా నేర్చుకున్నామని, ఈ సారి జట్టులో అనేక మార్పులు చేసినట్లు చెప్పుకొచ్చాడు.
కొంత మంది కొత్త ఆటగాళ్లను తీసుకున్నామని, ఈ సీజన్‌లో రాజస్థాన్ జట్టు బలంగా ఉందని చెప్పాడు. టీంలో స్వదేశీ ఆటగాళ్లతోపాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారని, అందరూ కలిసి అనుకున్న లక్ష్యాన్ని అందుకోవాలని భావిస్తున్నట్లు సంజూశాంసన్ పేర్కొన్నాడు. ఇది సుదీర్ఘమైన టోర్నమెంట్ కనుక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు చెప్పాడు. కాగా ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్‌ను మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.
రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టు
సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రాన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్, కేసీ కరియప్ప, నవదీప్ సైనీ, ఒబేద్ మెకాయ్, అరుణయ్ సింగ్, కుల్దీప్ సేన్, కరుణ్ జురెల్, దహ్రూవ్ నాయర్, , తేజస్ బరోకా, కులదీప్ యాదవ్, శుభమ్ గర్వాల్, డారిల్ మిచెల్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, నాథన్ కౌల్టర్-నైల్, జేమ్స్ నీషమ్.