
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ ఆడిన మ్యాచ్‌లో గాయపడిన ఆ జట్టు స్టార్ బౌలర్ నాథన్ కౌల్టర్‌నైల్ ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో ముంబైతో శనివారం రాజస్థాన్ రాయల్స్ ఆడనున్న మ్యాచ్‌లో కౌల్టర్‌నైల్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. కాగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 19వ ఓవర్ బౌలింగ్ చేస్తూ పేస్ బౌలర్ కౌల్టర్‌నైల్ గాయపడ్డాడు. అతని కుడి కాలికి గాయమైంది. దీంతో అతను ఆ ఓవర్ అనంతరం మైదానాన్ని వీడాడు. ఆ మ్యాచ్‌లో బౌలర్‌గానూ కౌల్టర్ నైల్ విఫలమయ్యాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 48 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. ముంబైతో మ్యాచ్‌లో నాథన్ కౌల్టర్ నైల్ ఆడకుంటే అతని స్థానంలో నవదీప్ సైనీ ఆడే అవకాశం ఉంది.
ఇక ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. సన్‌రైజర్స్‌పై ఆ జట్టు 61 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఏ దశలోనూ చేధించేలా కనిపించలేదు. ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోయింది. టాపార్డర్ ఘోరంగా విఫలమవడంతో ఎయిడెన్ మాక్రమ్ హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు ఆ జట్టు 7 వికెట్ట నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసింది.

రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టు
సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్, కెసి కరియప్ప, నవదీప్ సైనీ, ఒబేద్ మెక్‌కాయ్, అరుణయ్ సింగ్, కుల్దీప్ సేన్ , కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్, తేజస్ బరోకా, కుల్దీప్ యాదవ్, శుభమ్ గర్వాల్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, డారిల్ మిచెల్.