రాహుల్ త్రిపాఠి బ్రిలియంట్ క్యాచ్
భువనేశ్వర్ కుమార్ వేసిన మూడో ఓవర్ రెండో బంతిని గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ ఆఫ్‌సైడ్ బలంగా కొట్టాడు. అయితే ఆ బంతిని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డర్ రాహుల్ త్రిపాఠి గాలిలో డైవ్ చేస్తూ ఎడమ చేతితో అద్భుతంగా పట్టుకున్నాడు. ఆ క్యాచ్ చూసి బౌలింగ్ వేసిన భువనేశ్వర్ కుమార్ కూడా నమ్మలేకపోయాడు. దీంతో అతని జట్టు సభ్యులంతా అభినందించారు. కామెంటేటర్లు సైతం ప్రశంసలు కురిపిస్తూ ఈ సీజన్‌లో ఇది బెస్ట్ క్యాచ్‌గా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇక అప్పటికి 9 బంతులు ఎదుర్కొని 7 పరుగులు మాత్రమే చేసిన శుభ్‌మాన్ గిల్ నిరాశగా ఫెమిలియన్ చేరాడు. ఆ అద్భుత క్యాచ్ చూసి శుభ్‌మాన్ గిల్‌కు దిమ్మతిరిగిపోయిందని చెప్పుకోవాలి.

పవర్‌ప్లేలోనే 2 వికెట్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు తొలి ఓవర్లో భారీగా పరుగులు వచ్చాయి. ఆ ఓవర్లో భువనేశ్వర్ వైడ్ల రూపంలో భారీగా పరుగులు ఇచ్చుకోవడంతో ఏకంగా 17 పరుగులు వచ్చాయి. అయితే ఆ తర్వాతి నుంచి సన్‌రైజర్స్ బౌలర్లు కట్టడి చేశారు. మూడో ఓవర్లో భువనేశ్వర్, ఆరో ఓవర్లో నటరాజన్ వికెట్లు తీయడంతో గుజరాత్ టైటాన్స్ పవర్ ప్లే ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. ఇక 8 ఓవర్ల ఆట ముగిసే సమయానికి గుజరాత్ 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ ఉన్నారు.

తుది జట్లు
గుజరాత్ టైటాన్స్: మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, దర్శన్ నల్కండే
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్‌రామ్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి. నటరాజన్


Click it and Unblock the Notifications












