Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs GT: సన్‌రైజ‌ర్స్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌.. గాయంతో మ్యాచ్ మ‌ధ్య‌లోనే త‌ప్పుకున్న‌ రాహుల్ త్రిపాఠి

Rahul Tewatia to Tripathi, SIX, and drop-kicked over wide long-off for a sixer. But the batter has taken a fall. The ball has gone over the ropes though. That was a well flighted delivery and Tripathi put it away easily

గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో స‌న్‌రైజ‌ర్స్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ స్టార్ బ్యాట‌ర్ రాహుల్ త్రిపాఠి గాయంతో బ్యాటింగ్ మ‌ధ్య‌లోనే త‌ప్పుకున్నాడు. దీంతో రాహుల్ ఔట్ కాకుండానే నికోల‌స్ పూర‌న్ క్రీజులోకి వ‌చ్చాడు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ 9వ ఓవ‌ర్లో ఔట‌వగానే క్రీజులోకి వ‌చ్చిన రాహుల్ త్రిపాఠి ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఈ క్ర‌మంలో రాహుల్ తెవాటియా వేసిన 14వ ఓవ‌ర్ తొలి బంతిని భారీ సిక్సర్ బాదాడు. కానీ అదే స‌మ‌యంలో కాలి కండ‌రాలు ప‌ట్టేయడంతో మైదానంలో విల‌విలలాడాడు. ఫిజియోథెర‌పీ వ‌చ్చి చెక్ చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. నిజానికి అంత‌కుముందు నుంచే త్రిపాఠి కాస్త ఇబ్బందిగా క‌నిపించాడు.

ఫిజియో తాత్కాలిక వైద్యం అందించిన‌ప్ప‌టికీ ఫలితం లేక‌పోవ‌డంతో రాహుల్ త్రిపాఠి రిటైర్డ్ హార్ట్‌గా మైదానాన్ని వీడాడు. కాగా ఇది ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్‌కు హైద‌రాబాద్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌గా చెప్పుకోవాలి. అయితే రాహుల్ త్రిపాఠి గాయం పెద్ద‌దైతే రాహుల్ త్రిపాఠి మ‌రిన్ని మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంది. గాయం తీవ్ర‌త‌ను బ‌ట్టి ఈ సీజ‌న్ మొత్తానికే దూర‌మ‌య్యే ప్ర‌మాదం కూడా ఉంది. అదే జ‌రిగినే ఇది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌గా చెప్పుకోవాలి. ఎందుకంటే ధాటిగా ప‌రుగులు చేసే సామ‌ర్థ్యం ఉన్న రాహుల్ త్రిపాఠిపై స‌న్‌రైజ‌ర్స్ మేనేజ్‌మెంట్ భారీ అంచ‌నాలు పెట్టుకుంది.

కాగా రాహుల్ త్రిపాఠిపై ఉన్న న‌మ్మ‌కంతో మెగా వేలంలో అత‌డిని స‌న్‌రైజ‌ర్స్ 8 కోట్ల 50 ల‌క్ష‌ల రూపాయ‌ల భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. ఒక వేళ రాహుల్ త్రిపాఠి గాయంతో సీజ‌న్‌కు దూర‌మ‌య్యే స‌న్‌రైజ‌ర్స్‌కు 8 కోట్ల‌కు పైగా రూపాయ‌లు నష్ట‌మ‌నే చెప్పుకోవాలి. ఇక ఐపీఎల్‌లో ఇప్పటివ‌ర‌కు 66 మ్యాచ్‌లాడిన రాహుల్ త్రిపాఠి 26 స‌గ‌టుతో 1485 ప‌రుగులు చేశాడు. 7 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 93 ప‌రుగులుగా ఉంది. ఈ క్ర‌మంలో త్రిపాఠి 147 ఫోర్లు, 52 సిక్సులు బాదాడు.

Story first published: Monday, April 11, 2022, 23:25 [IST]
Other articles published on Apr 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+